జాతీయ వార్తలు

శ్రీకాళహస్తి ఆలయంలో త్రిపుర సీఎం ప్రత్యేక పూజలు!

  • శ్రీకాళహస్తీశ్వరుని సేవలో త్రిపుర సీఎం మాణిక్ సాహా 
  • సతీ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్న మాణిక్ సాహా
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. నిన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

తొలుత వారికి ఆలయ అధికారులు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారి వేద ఆశీర్వాదం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. క్షేత్ర మహాత్యం గురించి ఆలయ అధికారులు వివరించారు. 

Related posts

ఈసీకి రాహుల్ గాంధీ వార్నింగ్

Ram Narayana

జీఎస్టీ ఎఫెక్ట్ తో దీపావళి నుంచి ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే..!

Ram Narayana

ప్రజ్వల్ ఫ్లైట్ దిగగానే అరెస్ట్ ఖాయం …

Ram Narayana