తెలంగాణ వార్తలు

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం… ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు…

  • సుప్రీం లీడర్ ఖమేనీ హత్య నేపథ్యంలో ఇరాన్ ప్రతిదాడులు
  • అల్లకల్లోలంగా మారిన పశ్చిమాసియా
  • 24 గంటల హెల్ప్ లైన్ నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. దీంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. అమెరికాతో చర్చల ప్రసక్తి లేదని, ఈ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, ఇజ్రాయెల్ అధికార కాంక్ష కారణంగా ఇది ప్రారంభమైందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో చర్చలకు తాము సుముఖంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

పశ్చిమాసియా దేశాల్లోని తెలంగాణ పౌరుల సహాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాంగ శాఖ, సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో తెలంగాణ భవన్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆయా దేశాల్లోని పౌరులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.

24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను అధికారులు తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే – 871999044, 9958322143, 9910014749, 9643723157.

Related posts

గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం ,అజారుద్దీన్…తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం!

Ram Narayana

అక్ర‌మ నిర్మాణాల‌పై నోటీసులు.. న‌టుడు అలీ ఏమ‌న్నారంటే..!

Ram Narayana

మళ్లీ 90 సీట్లతో మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధీమా

Ram Narayana