అంతర్జాతీయం

గల్ఫ్ దేశాల అధినేతలకు మోదీ ఫోన్.. ఇరాన్ దాడిని ఖండించిన ప్రధాని..

  • సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్లో మాట్లాడిన మోదీ
  • బహ్రెయిన్ రాజు ఖలీఫాతో భారతీయుల భద్రతపై చర్చించిన ప్రధాని
  • సౌదీ, బహ్రెయిన్‌లపై ఇరాన్ దాడిని ఖండించిన నరేంద్ర మోదీ

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో అక్కడి భారతీయుల భద్రతపై చర్చలు జరిపారు. అదే సమయంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు. ఆయా దేశాధినేతలకు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు.

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ సల్మాన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో కూడా మాట్లాడారు. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతపై వారితో చర్చించారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌ల నాయకులతో చర్చల సందర్భంగా ఆ దేశాలపై ఇరాన్ దాడులను మోదీ ఖండించారు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల నాయకులతో ప్రధాని మోదీ నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్‌తో కూడా మాట్లాడారు. భారతీయుల క్షేమం కోసం కృషి చేస్తున్నందుకు ఆల్ నహ్యాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశాల్లోని పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి భద్రతా కేబినెట్ కమిటీ నిన్న సమావేశమైంది.

Related posts

అమెరికాలో వలసలదారులపై డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు ..

Ram Narayana

భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం: ట్రంప్ కీలక ప్రకటన…

Ram Narayana

వంకర బుద్ధి జో బైడెన్ ను ఓ అంశంలో మెచ్చుకోవాలి: ట్రంప్

Ram Narayana