జాతీయ వార్తలు

కేరళను తాకిన ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతలు …స్పందించిన సీఎం పినరై విజయం

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోగల వెలుగుమట్లలో పేదలు పక్క నివాసాలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేరళలో ఇల్లు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేరళ ముఖ్యమంత్రి పినారై విజయన్ విమర్శించారు .. పక్క ఇళ్లను కూల్చి వారికీ నిలవనీడలేకుండా చేసి విధానం పై ఆయన ధ్వజమెత్తారు .. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని దుయ్యబట్టారు .. భూదాన భూముల్లో నిర్మించుకున్న700 ఇళ్లను కూల్చివేసి, 3,000 మందిని నిరాశ్రయులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయడాన్ని ఆయన గర్హించారు ..

బీజేపీ మోడల్ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తుందన్నారు … తెలంగాణలో అణగారిన వర్గాలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు .. తెలంగాణాలో కూలగొడతాం -కేరళలో నిలబెడతామని అనడం అనుమానాలకు తావిస్తోందని విజయన్ అన్నారు ..

Related posts

“న్యాయ క్రియాశీలత… న్యాయ ఉగ్రవాదంగా మారకూడదు”: సీజేఐ జస్టిస్ గవాయ్

Ram Narayana

పలు దేశాల్లో ప్రభుత్వాలను కూల్చేస్తున్న జెన్ జీ… ఇండియాలో ఎందుకు మౌనంగా ఉంది?

Ram Narayana

పీఓకేను గురుదక్షిణగా ఇవ్వండి: ఆర్మీ చీఫ్‌ను కోరిన జగద్గురు రాంభద్రాచార్య

Ram Narayana