అంతర్జాతీయం

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో వందలాది చిన్నారులు మృతి: యూనిసెఫ్ ఆందోళన!

  • యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 181 మంది చిన్నారులు మృతి
  • లెబనాన్‌లో 7గురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృతి
  • వెల్లడించిన ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ యూనిసెఫ్
  • చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధం …

బుద్ది లేదు యుద్దోన్మాదులకు…వారి పగలు ప్రతీకారాలతో అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలను సైతం తీస్తున్నారు …బరితెగించి బాంబుల వర్షం కురిపిస్తున్నారు ..ఇరాన్ లోని ఒక పాఠశాలపై ఇజ్రాయెల్ వేసిన బాంబులతో 70 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారన్న వార్త ప్రపంచంలో మానవతా వాదులను కలిచివేసింది .. అసలు వీరిని చంపే హక్కు వారికీ ఎవరిచ్చారు …అంతర్జాతీయ సమాజం సిగ్గుతో తలవచుకోవాలి …మావళి మనుగడకు సామాన్యుడు జీవించడానికి హక్కులేదా …?బరితెగింపు యుద్ధాలతో పగలు ప్రతీకారాలతో ప్రపంచంలో ఉన్న సంపదనంతా తామే కాజేయాలని దుర్బుద్ధితో చేస్తున్న ఇలాంటి యుద్ధాలను ప్రపంచ మానవాళి ఖండించాలి ..కొంతమంది సంపద పోగేసుకునేందుకు తామంటే తామే యుద్ధంలో పై చేయి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు ..ఇదేం యుద్ధం అని ప్రజలు వణికి చేస్తున్నారు…సామాన్య ప్రజలకు పట్టని వారికీ సంబంధం లేని యుద్ధంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ భీతిల్లుతున్నారు .. చిన్నపిల్లను ఎత్తుకొని వీధుల వెంట పరుగెత్తుతున్న దృశ్యాలు మనసులను కదిలిస్తున్నాయి .. ఇప్పటికే ఈ యుద్ధంలో 180 మంది చిన్నారులు మరణించారని వస్తున్నా వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి…వారు ఏంపాపం చేశారని వారిని చంపుతున్నారు.. ఇదేమి యుద్ధ నీతి రాజుల కాలంలోనూ ఇలాంటి యుద్దాలు జరిగినట్లు చరిత్రలో సైతం ఎక్కడ రాయలేదు .. సూర్యోదం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్దాలు జరిగేవి …కానీ నేడు 24/7 యుద్దాలు కొనసాగుతున్నాయి…దొంగదెబ్బలే నేటి యుద్ధంలో నీతి గా మారింది ..

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గత నెల 28న ప్రారంభమైన యుద్ధం నేటితో ఏడవ రోజుకు చేరుకున్నది. ఈ యుద్ధంలో అత్యధికంగా ఇరాన్‌లో చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. ఇరాన్‌లో 181 మంది, లెబనాన్‌లో 7గురు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు, కువైట్‌లో ఒకరు మృతి చెందినట్లు వెల్లడించింది.

యుద్ధాలను పిల్లలు ప్రారంభించరని కానీ వారు కూడా మూల్యం చెల్లించుకుంటున్నారని పిల్లల హక్కులు, ఆరోగ్యం, విద్య, సంక్షేమం కోసం పనిచేసే ఈ ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే చిన్నారులపై ఆందోళనకర ప్రభావాన్ని చూపిందని పేర్కొంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త ఆపరేషన్‌లో మొదటి రోజు ఇరాన్‌లోని మినాబ్‌లో ఒక బాలికల పాఠశాలపై దాడి జరగగా, 160 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది.

Related posts

ఇరాన్‌పై యుద్ధ మేఘాలు.. ఈ వారాంతంలోనే దాడులకు అమెరికా సైన్యం సిద్ధం!

Ram Narayana

హెచ్-1బీ వీసా నిబంధనల ఎఫెక్ట్.. అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న వ్యతిరేకత

Ram Narayana

యూఎస్ – యూరప్ దేశాల సుంకాలపై మస్క్ కీలక వ్యాఖ్యలు!

Ram Narayana