హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌లో బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం..!

  • మల్లాపూర్‌లోని వైన్ షాపులో వెలుగుచూసిన ఘటన
  • కింగ్‌ఫిషర్ బీరులో చేపను చూసి అవాక్కైన కస్టమర్
  • నిలదీస్తే దురుసుగా ప్రవర్తించిన షాపు సిబ్బంది

హైదరాబాద్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కొనుగోలు చేసిన బీర్ బాటిల్‌లో ఏకంగా ఓ చేప పిల్ల సజీవంగా ఈదుతూ కనిపించడం కలకలం రేపింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపులో నిన్న‌ ఓ కస్టమర్ కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. దానిని తాగేందుకు మూత తీయగా, అందులో చిన్న చేప పిల్ల కదులుతూ కనిపించింది. ఊహించని ఈ పరిణామంతో అవాక్కైన అతను, వెంటనే వైన్ షాపు నిర్వాహకుడిని సంప్రదించి విషయం చెప్పాడు.

అయితే, షాపు సిబ్బంది బాధ్యతాయుతంగా స్పందించకపోగా, కస్టమర్‌తో దురుసుగా ప్రవర్తించారు. బీర్లను తాము తయారు చేయమని, ఏమైనా ఉంటే నేరుగా కంపెనీని అడగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. వారి తీరుతో అసహనానికి గురైన ఆ కస్టమర్, బీర్ బాటిల్‌లో చేప కదులుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Related posts

హైదరాబాద్‌లో భారీ దోపిడీ.. యజమానిని కట్టేసి రూ.50 లక్షల సొత్తు దోచుకున్న నేపాల్ ముఠా..

Ram Narayana

విద్యార్థుల నిరసన… హెచ్‌సీయూలో ఉద్రిక్తత!

Ram Narayana

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తాం: పొన్నం ప్రభాకర్

Ram Narayana