ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు పాపులేషన్ పాలసీపై షర్మిల సెటైర్…

  • చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం
  • ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న
  • నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన
  • రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యంగ్యంగా స్పందించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనమని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.

“చంద్రబాబు పాపులేషన్ పాలసీ హాస్యాస్పదం. ఉన్న బిడ్డలకే దిక్కులేదు… ఇప్పుడు ముగ్గురు పిల్లలను కనాలా? మీరిచ్చే బోడి 25 వేల కోసం మూడో బిడ్డను కనమంటారా? ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆటోలు తోలుకుంటూ, ట్యాక్సీ డ్రైవర్లుగా బ్రతుకుతున్నారు. రాష్ట్రంలో మీరిచ్చిన హామీలు అమలు కాలేదు. మీరు, జగన్ గారు కలిసి రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ పథకానికి 3 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 6 వేల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మాఫియాలు చేసుకుంటూ, రాష్ట్రాన్ని దోచుకుంటూ… బిడ్డలను కనమని చెబితే ఎలా చంద్రబాబు గారూ?” అంటూ షర్మిల ధ్వజమెత్తారు.

Related posts

సీఎం అవుతాడని నేను నమ్మిన పవన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం: ఉండవల్లి

Ram Narayana

ఆ వార్త చూడగానే ప్రతి ఒక్కరూ ఎంతో వేదనకు గురయ్యారు: పట్టాభి

Ram Narayana

రూటు మార్చిన షర్మిల..! జగన్‌తో రాజీనా ..!!

Ram Narayana