Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు 7 పథకాలు …పసిడితో మెరిసిన నీరజ్ చోప్రా !

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు 7 పథకాలు …పసిడితో మెరిసిన నీరజ్ చోప్రా

-పసిడి తో మెరిసిన నీరజ్ కు నజరానాల వెల్లువ…
రెజ్లర్ భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నజరానా అందించనున్న హర్యానా ప్రభుత్వం
-టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
-జావెలిన్ త్రో 87.58మీ విసిరిన చోప్రా
-అథ్లెటిక్స్ లో భారత్ కు ఇదే తొలి ఒలింపిక్ స్వర్ణం
-టోక్యో ఒలింపిక్స్ లో ఏడుకు పెరిగిన భారత్ పతకాలు
-ఒలింపిక్స్ కు ముందే క్రీడా విధానం ప్రకటించిన హర్యానా
-నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, స్థలం అందజేత
-పునియా స్వగ్రామంలో ఇండోర్ స్టేడియం

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం 7 పథకాలు లభించాయి…. ఇందులో ఒకటి స్వర్ణం కాగా రెండు రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. మొత్తానికి మనవాళ్ళు ఫర్వాలేదని అనిపించారు. మరికొద్దిగా కష్టపడితే మరో రెండు మూడు పథకాలు ఖాయమయ్యేయి. కాని మనం పథకాల పట్టికలో చివరి స్థానంలోనే ఉన్నాం . మేక్ ఇండియా , మేడ్ ఇన్ ఇండియా అంటూ డైలాగ్ లేక్ పరిమితం అవుతున్నామని విమర్శలు ఉన్నాయి.జాతీయక్రీడ విధానం సరిగా లేకపోవడంతో మనవళ్ల జనాభా రీత్యా ప్రపంచంలో రెండవస్థానంలో ఉన్న పథకాల పట్టికలో మాత్రం చివరి స్థానాలలో ఉంటున్నాం . మనకన్నా చిన్న దేశాలు ఎన్నో విజయాలు సాగిస్తుండగా మనం వెనకబడి పోవటానికి కారణాలు విశ్లేషించుకుని ముందుకు పోవాలి . ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారులు తమకున్న శక్తిమేరకు భారత్ పథకాన్ని వేగరవేయడం అభినందనీయం .

యావత్ భారతావని మురిసేలా భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం అందించాడు. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా, అథ్లెటిక్స్ స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది.

టోక్యో ఒలింపిక్స్ లో పసిడి కాంతులు విరజిమ్మిన చోప్రా… ఇవాళ జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో తిరుగులేని బలంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ ను 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 7 పతకాలు లభించినట్టయింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. ఆయనపై నజరానాల వెల్లువలా మారిపోయాయి.

గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు రూ.6 కోట్ల నజరానా

  • టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రాకు స్వర్ణం
  • దేశవ్యాప్తంగా సందడి వాతావరణం
  • మిఠాయిలు పంచుకున్న చోప్రా కుటుంబం
  • గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించనున్న హర్యానా
Haryana govt will give Tokyo Olympics gold medalist Neeraj Chopra six crore rupees

టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధిండచమే కాకుండా, శతాధిక వసంతాల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు ఇప్పటివరకు అథ్లెటిక్స్ స్వర్ణం లేదన్న కొరత తీర్చిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా ఇప్పుడు జాతీయ హీరో అయ్యాడు.  ఈ క్రమంలో నీరజ్ చోప్రాపై  హర్యానా సర్కారు నజారానాల వర్షం కురిపించింది. టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజిక్కించుకున్నందుకు రూ.6 కోట్ల నగదు పురస్కారం అందించనుంది. దాంతోపాటే గ్రూప్-1 ఉద్యోగం, 50 శాతం రాయితీతో ఇంటి స్థలం కేటాయించనున్నారు.

కాగా, తాజా ఘనత అనంతరం అతడి స్వరాష్ట్రం హర్యానాలో సంబరాలు మిన్నంటుతున్నాయి. పానిపట్ లో చోప్రా కుటుంబ సభ్యులు మిఠాయిలు పంచుకున్నారు.

23 ఏళ్ల నీరజ్ చోప్రా జూనియర్ స్థాయి నుంచే ప్రతిభను ప్రదర్శిస్తూ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగాడు. గతంలోనూ ఈ జావెలిన్ త్రోయర్ పతకాల పంట పండించాడు. 2016లో వరల్డ్ అండర్-20 చాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గి సంచలనం నమోదు చేశాడు. ఆ ఏడాది జరిగిన ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ లో రజతం, ఆ తర్వాత 2017 ఆసియా చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ పసిడి వరించింది.

 

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన భారత రెజ్లర్ భజరంగ్ పునియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, హర్యానా ప్రభుత్వం భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నజరానా అందించనుంది. దీనిపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంతకుముందే ప్రకటించిన క్రీడా విధానం మేరకు భజరంగ్ పునియాకు రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగం, 50 శాతం రాయితీతో స్థలం అందజేస్తామని వెల్లడించారు. భజరంగ్ స్వస్థలం జజ్జర్ జిల్లాలోని ఖుదాన్ ప్రాంతంలో ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని తెలిపారు.

 

 

Related posts

దేశ జనాభాతో సమ నిష్పత్తిలో పెరుగుతున్న ముస్లిం జనాభా…!

Drukpadam

అమరావతి రాజధాని కేసు జులై 11 వాయిదా…!

Drukpadam

రెండు రోజులే ఛాన్స్‌.. ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు గ‌డువు పెంపు లేద‌ట‌!

Drukpadam

Leave a Comment