Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మందు పాతర పేల్చిన మావోయిస్టులు… 9 మంది జవాన్లు మృతి

  • చత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల ఘాతుకం
  • జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసిన మావోలు
  • ప్రాణాలు కోల్పోయిన 10 మంది జవాన్లు

గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల చేతిలో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈరోజు రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు. సుకుమా జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతాదళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. 

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర

ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు…. పేలి 9 మంది జవాన్లు మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. బీజాపూర్‌ జిల్లా కుట్రూ అడవి ప్రాంతంలో ఈ మందుపాతర పేలింది.

జవాన్లు వెళ్తున్న వ్యానును మావోయిస్టులు పేల్చేశారు. దంతెవాడ, నారాయణ పూర్, బీజాపూర్‌లో జాయింట్‌ ఆపరేషన్‌ నిర్వహించిన తర్వాత జవాన్లు వెళ్తున్న సమ యంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారని బస్తర్‌ ఐడీ మీడియాకు తెలిపారు.

కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే, మావోల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందారు.

అబుజ్‌మాద్‌లోని అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన మరవకముందే మావోయిస్టులు మందుపాతర పెట్టి తొమ్మిది మంది ప్రాణాలు తీశారు.

Related posts

శబరిమల అయ్యప్ప దర్శనం ఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారానే!

Ram Narayana

సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం తీసుకువస్తున్న కేంద్రం!

Ram Narayana

పేపర్ లీక్ చేస్తే కోటి జరిమానా …కేంద్ర చట్టం

Ram Narayana

Leave a Comment