హైద్రాబాద్ వార్తలు

తీరనున్న ట్రాఫిక్ కష్టాలు ..నేడే ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం!

  • నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ అరాంఘర్ – జూపార్క్ పైవంతెన 
  • సాయంత్రం 4 గంటలకు పచ్చజెండా ఊపనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • 800 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న అరాంఘర్ – జూపార్క్ ఫ్లైఓవర్

హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.08 కిలోమీటర్ల పొడవున దాదాపు రూ.800 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఈ రోజు సాయంత్రం సీఎం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

వాస్తవానికి ఈ ఫ్లైఓవర్ ను గత ఏడాది డిసెంబర్ లోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే తమ పరిధిలోనే కార్యక్రమం చేపట్టాలంటూ ఇటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్, మరో పక్క ఎంపీ అసదుద్దీన్ వర్గాలు పట్టుబట్టడంతో ప్రారంభోత్సవం వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

ఎట్టకేలకు ఈ రోజు (సోమవారం) సీఎం రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ఈ ఆరు లైన్ల వంతెన నుంచి వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపనున్నారు. 
.

Related posts

ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్.. ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం…

Ram Narayana

కూల్చివేతల ఖర్చు మొత్తం మీదే.. అక్రమ నిర్మాణదారులకు హైడ్రా స్పష్టీకరణ!

Ram Narayana

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. మొత్తం విలువలో సగం ఖరీదైన ఇళ్లదే!

Ram Narayana