అంతర్జాతీయం

ట్రంప్ బరితెగింపు వ్యాఖ్యలు …ఇరాన్ నాయకుడి ఎంపికలో ఆయన అనుమతి కావాలట…

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు ట్రంప్ వార్నింగ్
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ నియామకం
  • ఈ నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్
  • “అతను ప్రశాంతంగా జీవించలేడు” అంటూ ఘాటు హెచ్చరిక
  • నియామకంలో తన ప్రమేయం ఉండాల్సిందని వ్యాఖ్య
  • పెరుగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు

ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి ..ట్రంప్ బరితెగించి మాట్లాడుతున్నారని ఇరానీయన్లు మండి పడుతున్నారు ..మధ్య ప్రాశ్చ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల అమెరికా కూడా భారీ స్థాయిలో నష్ట పోతుంది ..అయినా యుద్దాన్ని కొనసాగిస్తూ బింకాలు పలుకుతుందని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…ఒక రకంగా చెప్పాలంటే ఇది మూడవ ప్రపంచ యుద్దానికి దారితీయవచ్చుననే ఆందోళనలు ఉన్నాయి… దీనిపై ఇప్పటికే రష్యా ఇరాన్ కు బహిరంగంగానే మద్దతు ప్రకటించగా , చైనా పరోక్ష సహకారాన్ని అందిస్తుంది ..అమెరికా చర్యలు ఇలానే కొనసాగితే చైనా బహిరంగంగానే మద్దతు ప్రకటించవచ్చునని యుద్ధరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు …

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. “అతను ప్రశాంతంగా జీవించగలడని నేను అనుకోవడం లేదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి తర్వాత ఆయన కుమారుడైన 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీని కొత్త అధినేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇరాన్ ఈ నాయకుడిని ఎన్నుకోవడంపై నేను సంతోషంగా లేను. అతను ప్రశాంతంగా బతకలేడు” అని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ నియామక ప్రక్రియలో వెనెజువెలా తరహాలోనే తన ప్రమేయం కలిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, ఖమేనీ విధానాలు గత పాలకుల మాదిరే కొనసాగితే ఐదేళ్లలో మరో యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించారు. “ఆ పదవిలో కొనసాగాలంటే అతను మా అనుమతి తీసుకోవాలి. లేకపోతే ఎక్కువ కాలం ఉండలేడు” అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related posts

ఖమేనీ మృతి మూమూలు విషయం కాదు… ట్రంప్‌ను వదిలిపెట్టేది లేదు: అలీ లారిజాని

Ram Narayana

కొరియన్ యువతులే టార్గెట్… ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తికి 40 ఏళ్ల జైలు శిక్ష!

Ram Narayana

నూతన పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్… అమెరికా నుంచి తొలి పోప్!

Ram Narayana