ఎంటర్టైన్మెంట్ వార్తలు

రెండవ పెళ్ళికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి..!

రెండవ పెళ్ళికి సిద్ధమవుతున్న మాజీ మంత్రి మల్లారెడ్డి..!

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్‌… స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.. అందుకే.. తమ పెళ్లికి రారండోయ్‌.. అంటూ పెళ్లి వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించడం ఆసక్తి కలిగిస్తోంది..!

తన జీవిత భాగస్వామి కల్పనతో 50 ఏళ్ల దాంపత్య బంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆమెను మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడుతున్నారు. మార్చి 19వ తేదీన జరిగే గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్‌ వేడుకలో భాగంగా.. కొత్త పెళ్లిని తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణ వ్రతం, హల్దీ, సంగీత్‌ సహా అన్ని కార్యక్రమాలతో ధూమ్ ధాం సందడి చేయబోతున్నారు..!

నేడు గురువారం నుంచి మల్లారెడ్డి ఇంట్లో ప్రత్యేక పెళ్లి కార్యక్రమాలు షురూ కాబోతున్నాయి..!

Related posts

చైతూ భర్తగా రావడం నా అదృష్టం.. శోభిత ధూళిపాళ…

Ram Narayana

శరీరాకృతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.. తమన్నా భాటియా

Ram Narayana

గన్నవరం విమానాశ్రయంలో జగన్ తో సినీ నటుడు బ్రహ్మానందం…

Ram Narayana