తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రూ. 3,24,234 కోట్లతో 2026-27 తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశం పెట్టిన భట్టి…

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ. 3,24,234 కోట్లతో బడ్జెట్ ను ఆయన సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తాము సరిదిద్దుతున్నామని చెప్పారు. 

దేశంలో తెలంగాణను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7 శాతం ఎక్కువని వెల్లడించారు. రాష్ట్ర తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించడమే తమ లక్ష్యమని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. 

అటు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ… అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. పారిశ్రామిక శిక్షణ పొందుతున్న యువతను ప్రోత్సహించేందుకు… ఐటీఐ, ఏటీసీల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2 వేల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామని తెలిపారు. ఇకపై ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నట్టు వెల్లడించారు.

బడ్జెట్ వివరాలు:

  • మొత్తం బడ్జెట్‌ – రూ.3,24,234 కోట్లు
  • రెవెన్యూ వ్యయం – రూ.2,34,406 కోట్లు
  • మూలధన వ్యయం – రూ.47,267 కోట్లు
  • ద్రవ్యలోటు – రూ.58,458 కోట్లు
  • తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు
  • రైతు సంక్షేమం – రూ.23,179 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం – రూ.11,784 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం – రూ.7,937కోట్లు
  • బీసీ సంక్షేమం – రూ.12,511 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం – రూ.3,769 కోట్లు
  • విద్యుత్ – రూ.21,285 కోట్లు
  • విద్యా శాఖ – రూ.26,674 కోట్లు
  • సివిల్ సప్లయ్ – రూ.7,366 కోట్లు
  • పరిశ్రమలు – రూ.3,490 కోట్లు
  • చేనేత – రూ.258 కోట్లు
  • పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు
  • సాగునీటి ప్రాజెక్టులు – రూ.22,615 కోట్లు
  • రవాణా శాఖ – రూ.12,759 కోట్లు
  • పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ – రూ.17,907కోట్లు
  • పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.33,688 కోట్లు
  • వైద్యం – రూ.13,679 కోట్లు
  • కార్మికుల సంక్షేమం – రూ.999 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం – రూ.3,143 కోట్లు
  • రాజీవ్ యువ వికాసం – రూ.6వేల కోట్లు
  • గృహ నిర్మాణం – రూ.7,430 కోట్లు
  • ఐటీ రంగం – రూ.875 కోట్లు
  • న్యాయ శాఖ – రూ.2,367 కోట్లు.

శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 2

Matti Bhatti Vikramarka Announces Telangana Budget Focus on Welfare

బడ్జెట్ వివరాలు:

  • శాంతి భద్రతలకు – రూ.11,907 కోట్లు
  • రోడ్లు భవనాల శాఖకు – రూ.6,416 కోట్లు
  • రీజనల్ రింగ్ రోడ్డుకు – రూ1,525 కోట్లు
  • హ్యామ్ రోడ్లకు – రూ.3,053 కోట్లు
  • గోదావరి పుష్కరాలకు – రూ.500 కోట్లు
  • పంచాయతీరాజ్ రోడ్లకు – రూ.2,062 కోట్లు
  • మూసి రివర్ ఫ్రంట్‌కు – రూ.1,500 కోట్లు
  • గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్)కి – రూ.2,080 కోట్లు
  • ఇందిరమ్మ ఇళ్లకు – రూ.5,500 కోట్లు
  • మహాలక్ష్మికి – రూ.4,305 కోట్లు
  • పర్యాటక శాఖకు – రూ.1,224 కోట్లు
  • రైతు భరోసాకు – రూ.18,000 కోట్లు
  • చేయూతకు – రూ.14,861 కోట్లు
  • పవర్ సబ్సిడీకి – రూ.14,000 కోట్లు
  • బియ్యం సబ్సిడీకి – రూ.3,000 కోట్లు
  • సన్న వడ్ల బోనస్‌కు – రూ.3,500 కోట్లు
  • పంటల బీమా పథకానికి – రూ.1,886 కోట్లు
  • కల్యాణలక్ష్మి / షాది ముబారక్ కు – రూ.3,683 కోట్లు
  • విద్యార్థుల డైట్ ఛార్జీలకు – రూ.2,170 కోట్లు
  • రాజీవ్ యువ వికాసానికి – రూ.5,800 కోట్లు
  • యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి – రూ.5,000 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి – రూ.4,000 కోట్లు
  • రాజీవ్ ఆరోగ్యశ్రీకి – రూ.1,143 కోట్లు
  • రాజీవ్ యువ వికాసానికి – రూ.5,800 కోట్లు
  • మహాలక్ష్మి పథకం కింద LPG గ్యాస్ సబ్సిడీకి – రూ.723 కోట్లు
  • ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు – రూ.600 కోట్లు
  • స్కాలర్‌షిప్‌లకు – రూ.4,343 కోట్లు
  • తప్పనిసరి కార్యాలయ ఖర్చులకు – రూ.2,323 కోట్లు
  • ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు – రూ.1,500 కోట్లు
  • యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి – రూ.5,000 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి – రూ.4,000 కోట్లు
  • ఉస్మానియా యూనివర్సిటీకి – రూ.1000 కోట్లు.

ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 3

Telangana Budget 2024 Rs 50713 Crore for Six Guarantees

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ 3,24,234 కోట్లతో బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మల్లు భట్టి తెలిపారు.

బడ్జెట్ వివరాలు:

  • ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు
  • సంక్షేమం, అభివృద్ధికి రూ. 1,45,592 కోట్లు
  • ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల కవరేజ్
  • జూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు
  • 2026-27 ఏడాది పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
  • చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు 
  • దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
  • వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల కల్పనకు రూ. 100 కోట్లు
  • 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడేషన్
  • విద్యాశాఖ పరిధిలోకి స్కిల్ యూనివర్సిటీ
  • విదేశాల్లో యువతకు ఉపాధి అవకాశాల కోసం కొత్తగా సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం
  • భూ భారతి చట్టం – 2025 అమలు
  • ఏఐ ఆధారిత ‘భూ మిత్ర’ చాట్‌బాట్ ప్రవేశపెట్టడం
  • డ్వాక్రా మహిళలకు రూ. 2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు 
  • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ.350 కోట్లు
  • ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
  • హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు
  • మిషన్ భగీరథ అర్బన్ కు రూ. 500 కోట్లు
  • క్యూర్ ఏరియా అభివృద్ధికి రూ. 2,654 కోట్లు
  • పెట్రోల్, డీజీల్ ఆటోలు ప్రభుత్వ ఖర్చుతో ఈవీలుగా మార్పు
  • కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం
  • షెడ్యూల్ తెగలకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు.

Related posts

తెలంగాణ పరిస్థితికి చావుడప్పు కొట్టాలి ..కానీ డీజే కొట్టినట్లుగా ఉందన్న కేటీఆర్

Ram Narayana

ఉపాధి హామీ పథకంలో మార్పులకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం..

Ram Narayana

దటీజ్ సీనియర్ ఎమ్మెల్యే దానం …అందరికంటే నేనే సీనియర్

Ram Narayana