తెలుగు రాష్ట్రాలు

బంజారాహిల్స్‌లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హల్ చల్.. !

ఏపీలోని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ హైదరాబాద్‌లో కలకలం సృష్టించారు. నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఓ వివాదాస్పద స్థలం వద్ద ఆయన హంగామా చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే… బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనుక ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీ స్థలంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆదివారం ఉదయం సీఎం రమేశ్‌ తన అనుచరులతో కలిసి ఈ స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నవారిని ఉద్దేశిస్తూ, “వీడియో తీయ్” అంటూ తన సిబ్బందిని ఆదేశిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన రాకతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఈ వివాదం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు చేరినట్లు సమాచారం. అయితే, సీఎం రమేశ్‌ ఆ స్థలానికి ఎందుకు వెళ్లారు? ఈ ఘటనపై ఎవరైనా ఫిర్యాదు చేశారా? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Related posts

ఏపీ, తెలంగాణలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్!

Ram Narayana

భూసేకరణ తొందరగా జరిపితే వరంగల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం తొందరగా పూర్తీ ..కేంద్రమంత్రి

Ram Narayana

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!

Ram Narayana