ఖమ్మం వార్తలు

మధిర కోల్డ్ స్టోరేజ్ ప్రమాదం… రెండో ఛాంబర్‌లోకి వ్యాపించిన మంటలు…

ఖమ్మం జిల్లాలోని మధిర మండల పరిధిలోని ఆత్కూర్ సమీపంలో సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. తాజాగా మంటలు రెండో ఛాంబర్‌లోకి వ్యాపించాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో రెండు ఛాంబర్స్ ఉన్నాయి. మొదట ఒక్క ఛాంబరులోనే మంటలు చెలరేగాయి.

తాజాగా రెండో ఛాంబరుకు కూడా మంటలు వ్యాపించడంతో మిర్చి కాలిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా మంటలు అదుపులోకి రావడం లేదు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి స్కై ఫైరింజన్లను పంపించారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Related posts

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంపై తిరుగుబాటు …

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టిని మర్యాద పూర్వకంగా కలిసిన ఖమ్మం ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి

Ram Narayana