టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు రాష్ట్రాల నేతలు పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కుటుంబసభ్యులతో కలిసి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి, వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.










ధూళిపాళ్ల కుమార్తె వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరుకావడం విశేషం. ఇదే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలిసి సందడి చేశారు. ఇద్దరు నేతలు ఒకే వేదికపై కనిపించడంతో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. ఈ పెళ్లి వేడుక పలువురు రాజకీయ ప్రముఖుల కలయికకు వేదికగా నిలిచింది.


