Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

బీజేపీ వైపు చిరంజీవి చూపు ….

  • కూటమి పాలన అద్భుతంగా ఉందన్న టీజీ వెంకటేశ్
  • ఏపీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నారని వ్యాఖ్య
  • రాష్ట్ర విభజనకు రోశయ్య మద్దతు తెలపలేదని వెల్లడి

మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మాజీమంత్రి …తెలుగు సినీ ప్రపంచంలో నెంబర్ వన్ హీరో ..లెజెండ్ గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రి అయ్యారు …నిన్నమొన్నటివరకు ఆయన కాంగ్రెస్ పార్టీనే అనుకున్నారు ..కానీ ఆయన అడుగులు బీజేపీకి దగ్గర అవుతున్నాయి… బీజేపీ వైపు చిరంజీవి చూపు చూస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు .. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉంటూ ఏపీలో కీలకంగా వ్యవరిస్తుండటంతో చిరంజీవి తిరిగి యాక్టీవ్ రాజకీయాల్లో పాల్గొంటారనే చర్చలు మొదలయ్యాయి..అందుకు కారణాలు లేకపోలేదు …మోడీ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చింది …అంతకు ముందే అల్లూరి జిల్లాలో సీతారామ రాజు విగ్రహాష్కరణ సందర్భంగా మోడీతో డైయస్ పంచుకున్నారు …తర్వాత బీజేపీ పట్ల సానుకూల వైఖరిని కనబరుస్తున్నారు …సంక్రాంత్రి సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రంలో ప్రధానితోపాటు చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు …దీంతో చిరంజీవి బీజేపీకి దగ్గర అవుతున్నారనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి….దీన్ని ద్రువీకరించేలా టిజి వెంకటేష్ చిరంజీవి బీజేపీతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి…

బీజేపీ పెద్దలు, చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారు: టీజీ వెంకటేశ్


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీతో మెగాస్టార్ చిరంజీవి సన్నిహితంగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు కూడా చిరంజీవి వెళ్లారు. ఆ వేడుకలో ప్రధాని మోదీ పక్కనే చిరంజీవి ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ… బీజేపీ పెద్దలు, చిరంజీవి స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అంతకు మించి తనకు ఏమీ తెలియదని అన్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం వల్ల కూటమి ఏడు నెలల పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఏపీ పారిశ్రామికవేత్తలు ఏపీలో ట్యాక్సులు కడుతున్నారని… వాటిలో మనకు రావాల్సిన వాటా రావడం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని చెప్పారు. 

ఏపీ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలు పెట్టింది తానేనని తెలిపారు. తెలంగాణ విభజనకు అప్పటి సీఎం రోశయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పగలగొట్టేందుకు ఆందోళనకారులు వచ్చినప్పుడు… కృష్ణదేవరాయల విగ్రహం పగలగొట్టే ముందు తమపై దాడి చేయాలని కోరానని… దీంతో వాళ్లు తమను గౌరవించి వెనక్కి వెళ్లారని తెలిపారు. విభజన హామీల అమలు దిశగా రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టాలని… విభజన హామీల అమలుకు తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని చెప్పారు.

Related posts

డిప్యూటీ సీఎంకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు…

Ram Narayana

ముఖ్యమంత్రుల సమావేశంలో మేం తీసుకున్న నిర్ణయాలు ఇవే: భట్టి విక్రమార్క

Ram Narayana

మే 13న ఎన్నికలు… హైదరాబాద్ నుంచి ఏపీకి పెరిగిన రష్..!

Ram Narayana

Leave a Comment