- ఉదయం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు
- సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కేసు నిందితుడేనంటూ మీడియాలో కథనాలు
- సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసుల వివరణ
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని… విచారిస్తున్నట్లు ఉదయం నుంచి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు. బాంద్రా పోలీస్ స్టేషన్‌కు ఓ వ్యక్తిని తీసుకువచ్చామని, కానీ అతనికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సైఫ్ అలీఖాన్ కేసుకు సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
కాగా, ఈ ఉదయం పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని పోలీసులు తాజాగా స్పష్టం చేశారు.
సైఫ్ ఆరోగ్యంపై లీలావతి ఆసుపత్రి వైద్యుల అప్‌డేట్ ఇదే..!

- సైఫ్ ఆరోగ్యం మెరుగవుతోందన్న వైద్యులు
- ఆయన నడవగలుగుతున్నారని వెల్లడి
- అలాగే, బాగానే మాట్లాడగలుగుతున్నారన్న డాక్టర్లు
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ బాంద్రాలోని ఆయన నివాసంలో ఓ దుండగుడి చేతిలో గాయపడిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సైఫ్ హెల్త్ బులిటెన్‌ను ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని డాక్టర్లు వెల్లడించారు. తనంతట తానుగా సైఫ్ నడవగలుగుతున్నారని తెలిపారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడిన లీలావతి ఆసుపత్రి వైద్యులు… “సైఫ్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఆయన బాగానే మాట్లాడగలుగుతున్నారు. అలాగే నడవగలుగుతున్నారు. వెన్ను నుంచి కత్తి మొనను తొలగించాం. గాయాల కారణంగా ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అందుకే కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని ఆయనకు చెప్పాం. సైఫ్‌ను ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌లోకి మారుస్తాం. కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని బట్టి డిశార్జ్ చేస్తాం” అని వైద్యులు చెప్పుకొచ్చారు.