అంతర్జాతీయం

యుద్ధం అమెరికాది.. ఖర్చు అరబ్ దేశాలదా? ట్రంప్ కొత్త ‘వ్యూహం’పై కలకలం!

పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ పై అమెరికా సైన్యం చేస్తున్న పోరాటానికి అవుతున్న వ్యయాన్ని సౌదీ అరేబియా, యూఏఈ వంటి సంపన్న అరబ్ మిత్రదేశాల నుంచి రాబట్టాలని ఆయన భావిస్తున్నట్లు శ్వేతసౌధ వర్గాల సమాచారం. ‘‘అమెరికా సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, దానివల్ల రక్షణ పొందుతున్న భాగస్వామ్య దేశాలే యుద్ధ ఖర్చును భరించాలి’’ అనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.

ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి అరబ్ దేశాలను కాపాడేందుకు అమెరికా తన సైనిక శక్తిని, వనరులను వినియోగిస్తోందని, కాబట్టి ఆ యుద్ధానికి అయ్యే బిల్లును ఆ దేశాలే చెల్లించాలని ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. ఈ విధానాన్ని ‘పే ఫర్ ప్రొటెక్షన్’ (రక్షణకు మూల్యం చెల్లించడం)గా అభివర్ణిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ట్రిలియన్ డాలర్ల భారాన్ని తగ్గించుకోవడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. గతంలోనూ పలుమార్లు మిత్రదేశాలు తమ రక్షణ కోసం తగినంత ఖర్చు చేయాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ తాజా ప్రతిపాదనతో అరబ్ దేశాల్లో చర్చ మొదలైంది. ఒకవైపు ఇరాన్‌ను నిలువరించడానికి అమెరికా మద్దతు తప్పనిసరి కాగా, మరోవైపు యుద్ధ వ్యయాన్ని పూర్తిగా భరించడంపై ఆ దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఈ నిర్ణయం అమెరికా-అరబ్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని, కేవలం డబ్బు కోసమే అమెరికా యుద్ధాలు చేస్తుందనే అపప్రథ వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ డిమాండ్ పశ్చిమాసియా రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది.

Related posts

ఎవరీ ‘మేడమ్ ఎన్’… భారత ఇన్‌ఫ్లుయెన్సర్లకు వల!

Ram Narayana

అమెరికా తిప్పి పంపేసిన విద్యార్థులకు అండగా ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్

Ram Narayana

బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో దుకాణం మూసేసి భారత్ పైనే దృష్టి కేంద్రీకరించనున్న ఓలా

Ram Narayana