తెలంగాణ వార్తలు

రేపటి నుంచి తెలంగాణలో చికెన్ దుకాణాలు బంద్.. ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. గతంలో కంటే మార్జిన్ ఇప్పుడు తక్కువగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో పౌల్ట్రీ వాళ్లు రిటైల్ దుకాణాలకు కిలోకు రూ.26 మార్జిన్ ఇచ్చేవారని, గత ఇరవై ఏళ్లుగా ఇదే మార్జిన్ ఇస్తున్నారని, ఇటీవల ఈ మార్జిన్ రూ.16కు తగ్గించారని దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కేజీ చికెన్ మార్జిన్ రూ.30 ఇవ్వాలని ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అందుకే మార్జిన్ పెంచే వరకు రేపటి నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం చికెన్ విక్రయాలపై వస్తున్న లాభాలు తక్కువగా ఉండటంతో షాపులు నిర్వహించడం కష్టంగా మారినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. తక్కువ మార్జిన్ వల్ల వ్యాపారుల జీవనోపాధి సవాల్‌గా మారిందని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు.

Related posts

బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు…

Ram Narayana

అమెరికాలో రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లారు?… స్పందించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం…

Ram Narayana

టికెట్ ఇవ్వకుంటే కారు దిగేస్తానన్న మాజీ ఎమ్మెల్యే…తీగల కృష్ణారెడ్డి వార్నింగ్.

Drukpadam