Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిబిఐ విచారణకు నేను సిద్ధం నీవు సిద్దమేనా :హరీశ్ రావుకు సవాల్ విసిరిన ఈటల!

సిబిఐ విచారణకు నేను సిద్ధం నీవు సిద్దమేనా :హరీశ్ రావుకు సవాల్ విసిరిన ఈటల!
-నా ఆస్తులపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి
-హరీష్ తన ఆస్తులపై విచారణకు సిద్ధమా?
-ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన హరీష్ కు -నా గురించి మాట్లాడే అర్హత లేదు
-హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తన గురించి అబద్ధపు మాటలు చెప్పి హుజూరాబాద్ ప్రజలను నమ్మించే ప్రయత్నాన్ని హరీశ్ చేశారని మండిపడ్డారు. హరీశ్ వి మోసపు మాటలనే విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని… ఇక్కడి ప్రజల ప్రేమను పొంది, వరుసగా గెలుస్తున్న వ్యక్తిని తానని చెప్పారు. ఎన్ని మోసపు మాటలు చెప్పిన ఇక్కడ ప్రజలు వినే పరిస్థితిలో లేరని ఈటల అన్నారు.

టీఆర్ఎస్ లో చేరడానికి ముందు తనకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను సిద్ధమని అన్నారు. 2001లో హరీశ్ కు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తులపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి తో విచారణకు ఆయన సిద్ధమా? అని సవాల్ విసిరారు. ఈ విషయంపై అబిడ్స్ లో బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

ఎమ్మెల్యే కాకుండానే మంత్రి అయిన హరీశ్ కు తన గురించి మాట్లాడే అర్హత కూడా లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటల తప్పుడు ప్రచారం చేస్తున్నారని… దుబ్బాక ఎన్నికలో కూడా ఇలాంటి మోసపూరిత మాటలు చెప్పిన హరీశ్ కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా హరీశ్ కు బుద్ధి చెపుతారని అన్నారు. తనకు ఏమి జరిగిందో హరీష్ కూడా అదే జరుగుతుందని అన్నారు. తాను మంత్రిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి గెలిచిన 9 మంది ఎమ్మెల్యే లము ప్రగతి భవన్ కు ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళితే సీఎం అపాయింట్మెంట్ ఇవ్వని విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. ఒక్కసారి కాదు మూడు సార్లు ఈ అవమానం జరిగిందన్నారు . అప్పుడే సీఎం గోళీలు ఇచ్చే సంతోషరావు తోనే ఇది ప్రగతి భవన్ కాదు బానిసల నిలయం అని పెట్టుకోండని చెప్పిన విషయాన్నీ ప్రస్తావించారు. దళితులను ,బీసీలను, మొత్తంగా ప్రజలను మోసం చేసింది. కేసీఆర్ కదా ? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికలతో దళితులూ గుర్తుకు వస్తున్నారు. నీ దళిత ముఖ్యమంత్రి ఏమైంది. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని అని అన్నారు.

ఖజానా ఖాళీ ఎక్కడనుంచి దళితబందు

మాటలు కోటలు దాటుతున్నాయి. నాకు తెలియని ఖజానా ఎక్కడుంది. అన్ని ఉసిపోయాయి. ఇప్పుడు డబ్బులే లేవు … ఎక్కడ నుంచి తెస్తారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఎటుపోతున్నాయి. అవి దళితులకు ఎందుకు ఖర్చు పెట్టడంలేదు. అవి ఎక్కడ ఖర్చు పెట్టారు. అని ప్రశ్నించారు.

Related posts

ఆదివాసీలపై ఇంత అమానుషంగా ? రాహుల్ ఫైర్ !

Drukpadam

భట్టి పాదయాత్రపై రాహుల్ గాంధీ ఆరా …!

Drukpadam

సంస్కరణల దిశగా కాంగ్రెస్ …ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్!

Drukpadam

Leave a Comment