తెలంగాణ వార్తలు

మేడిగడ్డ పనుల పరిశీలినకు మంత్రివర్గ సహచరులతో కలిసి వెళ్లిన  సీఎం  రేవంత్ రెడ్డి …  

సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో ఒక స్పష్టత వచ్చింది సమస్యను అర్ధం చేసుకోవడమే సగం పరిష్కారం సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్నాకే అధికారులు పనులు మొదలు పెట్టాలి సేకరించిన శాంపిల్స్ రిజల్ట్ కు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచన NDSA మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలి ప్రతీ పనిలో NDSA అప్రూవల్ తీసుకుని పనిచేయాలి..!అని అన్నారు 

మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన పిల్లర్ ను పరిశీలించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy visited Medigadda barriage
  • కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌ను పరిశీలించిన రేవంత్
  • యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
  • కాసేపల్లో కాటారంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్న సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రుల బృందంతో కలిసి స్వయంగా పరిశీలించారు. కుంగిపోయిన 7వ నంబర్ పిల్లర్‌తో పాటు పగుళ్లు ఇచ్చిన ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం, తాజా పరిస్థితులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

వర్షాకాలం రాకముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రాజెక్టుకు ఈ దుస్థితి పట్టిందని పరోక్షంగా సంకేతాలిస్తూనే, నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఈ పర్యటనలో ఆయన వెంట ఉన్నారు. 

మేడిగడ్డ పర్యటన అనంతరం కాటారంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు. ఈ వేదిక నుంచే ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘రైతు భరోసా’ రెండో విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు. 

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ

CM Revanth Reddy Visits Kaleshwaram Temple
  • భూపాలపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం
  • రూ.198 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శ్రీకారం

కాళేశ్వరంలోని ఆలయ అభివృద్ధి పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి తొలుత కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రూ.198 కోట్లతో చేపట్టబోయే ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.

అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని, ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్ జైన్‌తో కలిసి బ్యారేజీని పరిశీలిస్తారు. ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తూరిపల్లికి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతారు. ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను విడుదల చేస్తారు.

Related posts

కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదు: కేటీఆర్

Drukpadam

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై స్పందించిన రేవంత్ రెడ్డి, కేటీఆర్!

Ram Narayana

నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి అభయం ….నిరసనలు వద్దని హితవు …

Ram Narayana