తెలంగాణ రాజకీయ వార్తలు ..

నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై  కేసీఆర్ ధ్వజం … 

నువ్వు వెయ్యి జన్మలు ఎత్తినా నేను చావను నా కొడకా’ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై  కేసీఆర్ ధ్వజం … 

“తెలంగాణ గడ్డపై గంజి కేంద్రాలు నడిచిన రోజులు చూశాం.., కరెంట్ కోసం బషీర్‌బాగ్‌లో మన పిల్లలు ప్రాణాలిస్తుంటే చలించి ఉద్యమానికి వచ్చాను.. నన్ను బాడీ షేమింగ్ చేసినా, హేళన చేసినా పక్షిలా రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధించాను” అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాకముందున్న దుస్థితిని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాలమూరు నుంచి 90 శాతం వలసలు ఉండేవని, తిండి లేక, పని లేక ప్రజలు దేశాలు దాటి వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో కరెంట్ ఛార్జీలు పెంచితే నిరసన తెలిపిన వారిని కాల్చి చంపిన ఘటన తనను ఉద్యమం వైపు నడిపించిందని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ మంచినీళ్లు, 24 గంటల కరెంట్ ఇచ్చి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టామని గర్వంగా ప్రకటించారు. పాలన గాలికి.. కేసీఆర్ చావే లక్ష్యమా? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తులం బంగారం, స్కూటీలు, పెంచిన పెన్షన్లు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుబంధు, దళితబంధులను గాలికి వదిలేసి రైతులను, పేదలను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలు పాలన వదిలేసి కేసీఆర్ చావాలి అని కోరుకుంటున్నారు. వెయ్యి జన్మలెత్తినా నేను చావను నా కొడకా.. అంటూ అత్యంత ఘాటుగా స్పందించారు. అభివృద్ధి ముచ్చట లేదని, కేవలం పాలకుల చిల్లర మాటలు తప్ప రాష్ట్రంలో ఏమీ జరగడం లేదని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “మొన్న కేవలం 1.7 శాతం ఓట్లతోనే ఓడిపోయాం. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నైజాన్ని గ్రహిస్తున్నారు. మళ్లీ బరాబర్ మనమే అధికారంలోకి వస్తాం.. ఈసారి బంపర్ మెజార్టీతో వస్తాం”  కేసీఆర్ సభ ఉంది అంటే రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు.. మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాలా? –అని నిప్పులు చెరిగారు..  బిఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా గీడ్రా జాన్తా నహి దాన్ని ఎత్తి అవతల పడేస్తామని  ప్రకటించారు  – తనదైన శైలిలో  కేసీఆర్  అని కేడర్‌లో ఉత్సాహం నింపారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి… కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

Jeevan reddy joins BRS
  • జగిత్యాల బహిరంగ సభలో కారు ఎక్కిన జీవన్ రెడ్డి
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శ
  • ఈరోజు కేసీఆర్ వస్తున్నారనే మేడిగడ్డకు రేవంత్ రెడ్డి వచ్చారని ఆగ్రహం

జగిత్యాల మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 40 మంది తన ముఖ్య అనుచరులతో కలిసి ఆయన ‘కారు’ ఎక్కారు. ఈ సభకు జగిత్యాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ అసలు గతంలో ఇచ్చిన వాటిని కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఈరోజు జగిత్యాలకు వస్తున్నారని తెలిసి, నిన్నటి వరకు నిద్రపోయిన రేవంత్ రెడ్డి ఈరోజు మేడిగడ్డకు వచ్చారని విమర్శించారు.

ఎస్ఎల్‌బీసీ నిర్మాణ దశలో కుంగిపోతే 8 మంది కార్మికుల శవాలను కూడా వెలికి తీయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలినందుకు ఎంతో రాద్దాంతం చేశారని, మరి దానిని ఎందుకు బాగు చేయలేదని ప్రశ్నించారు. “నేను ఏదో ఆశించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు” అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, పీడ విరగడ కావాలని, నాయకత్వ మార్పు కావాలని తాను పార్టీ మారానని చెప్పారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అన్నీ చూశానని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీలో చేరిన జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి పార్టీ అధినేత కేసీఆర్ కీలక పదవిని ప్రకటించారు. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. రాజకీయాల్లో ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు.

భిన్న రాజకీయ వేదికల కారణంగా వేర్వేరుగా పనిచేశామని, వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులమని తెలిపారు. ఇద్దరం కలిసి ఎంతో పని చేశామని, నాలుగున్నర దశాబ్దాలుగా తాము స్నేహితులమేనని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి తనను కలిసి ఒక బ్రిడ్జి అడిగారని గుర్తు చేసుకున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరితే అన్ని నియోజకవర్గాల్లో ఆ ప్రభావం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఆయనకు పదవులు కొత్తకాదని, నికార్సైన వ్యక్తి అని కేసీఆర్ అన్నారు. అన్నదమ్ముల్లా కలిసి పనిచేద్దామని ఆయనకు చెప్పానని, ఇక నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు ఆయన భుజాల పైనే పెడతానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే జీవన్ రెడ్డికి బ్రహ్మాండమైన పదవి వస్తుందని తెలిపారు. జగిత్యాల యుద్ధం మీ వంతు తెలంగాణ యుద్ధం మా వంతు అన్నారు.

ఒకప్పుడు తెలంగాణ భయంకరమైన పరిస్థితుల్లో ఉండేదని, తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉండేదని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజులు ఉండేవని అన్నారు. మన బతుకు, మన భాష, మన ఉద్యోగాల మీద దాడి జరిగేదని అన్నారు. హైదరాబాద్‌లో నిరసన తెలిపేందుకు వస్తే బషీర్‌బాగ్ కాల్పులు జరిపారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను బయలుదేరితే అవహేళనలు చేశారని అన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు…

Ram Narayana

రాజకీయ కక్ష సాధింపుల కోసం హైడ్రా వాడకండి!: బీఆర్ఎస్‌

Ram Narayana

తుమ్మల కాంగ్రెస్ లోకి స్వాగతిస్తాం …పొదెం వీరయ్య …!

Ram Narayana