Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వీరతెలంగాణ పోరాటం వక్రీకరణకు బీజేపీ యత్నం:తమ్మినేని

 

 

సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్ళాలి  – వీరతెలంగాణ పోరాటం వక్రీకరణకు బీజేపీ యత్నం

  • -సాయుధ పోరాటం హిందూ-ముస్లిం కోట్లాట కాదు
  • -మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కాషాయ మూకల కుట్రలు – -కొత్తరూపంలో దోపిడీ సాగించే యత్నాలను తిప్పికొడదాం
  • -రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి దళితబంధు ఇవ్వాలి.
  • -తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వార్షికోత్సవ -సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం 

రాచరికం, భూస్వామ్యం, వెట్టిదాకిరికి వ్యతిరేకంగా సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్పూర్తితో ముందుకెళ్లాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. దేశంలో కొత్తరూపంలో దోపిడి సాగుతోందన్నారు. ఈ దోపిడీని అరికట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా కమ్యూనిస్టులతో కలిసి ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. వీర తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు కాషాయము చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే భూసంస్కరణలు అమలయ్యాయని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోకపోయినా రూ. 10 లక్షల దళితబంధు పథకాన్నైనా రాష్ట్రంలోని 730 మండలాలకు ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్లో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి సున్నా నాగేశ్వరరావు. అధ్యక్షతన శుక్రవారం ఏర్పాటు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వార్షికోత్సవ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని మాట్లాడారు. వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓ వీరోచిత పోరాటం అన్నారు. హిందూ ముస్లిం కోట్లాటగా దీన్ని చిత్రీకరించేందుకు టీజేపీ. చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. దేశంలో కొత్తరూపంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని వీరతెలంగాణ పోరాట స్ఫూర్తితో అరికట్టేందుకు కమ్యూనిస్టులు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు అక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 1946 సెప్టెంబర్ నుంచి 1951 అక్టోబర్ వరకు 70 ఏళ్ల కిండ సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే దేశంలో భూసంస్కరణలు, భూ పంపకాలు జరిగాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెబుతున్న విధంగా సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య కోట్లాటైతే బందగీ, షోయబుల్లాఖాన్, మగ్దూం మొయినొద్దీన్ వంటి వీరు నిజాం ప్రభువు చేతిలో ఎందుకు హతమార్చబడ్డారని ప్రశ్నించారు. వీరతెలంగాణ పోరాటం కులమతాలకు అతీతంగా జరిగిందన్నారు. నిజాం నిరంకుశత్వం, వేలు, లక్షల ఎకరాలున్న భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగిందన్నారు. విస్కూర్ దేశముఖ్ రామచంద్రారెడ్డి, ఇన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, రాఘవరావు… తదితర జాగిర్దారులు కల్లాల్లో సూర్పిడి చేసే సమయానికి పంటలాకి వారన్నారు. తెల్దారుపల్లి, జాగిర్దార్కు వ్యతిరేకంగా తమ్మినేని సుబ్బయ్య చేసిన పోరాటాన్ని ప్రస్తావించారు. రావి నారాయణరెడ్డి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, దొడ్డి కొమరయ్య తదితర వీరుల పోరాట పటిమను వివరించారు. వెట్టిచాకిరీపై తిరుగుబాటు చేసిన మొదటి వీరవనిత చాకలి ఐలమ్మ. మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య, తొలి ఆయుధం వదిసేల, మొత్తంగా వీరతెలంగాణ సాయుధ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. నెహ్రూ సైన్యం నైజాం సంస్థానాన్ని విలీనం చేసుకున్నా వెట్టిచాకిరీ నిషేధ చట్టాలు చేయలేదన్నారు. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టులు సాగించిన పోరాట ఫలితంగానే వెట్టిచాకిరీ నిషేధ చట్టు, 36ఈ కొలుచట్టం. 54 ఎకరాల భూసీలింగ్ యాక్టు ఇలాంటివెన్నో అమల్లోకి వచ్చాయని తమ్మినేని వీరభద్రం చెప్పారు. వీటి ఫలితంగానే ఆయా ప్రభుత్వాలు భూపంపకాలకు సిద్ధపడ్డాయన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు. అదిగన భూపంపిణీ కమ్యూనిస్టుల పోరాట ఫలితమే అన్నారు. పోడు చేసిన గిరిజన రైతుకు పది ఎకరాలు ఇచ్చే భూముల అటవీ హక్కు చట్టాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారని ఆరోపించారు. పోడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ పిల్లల తల్లులపైనా కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించడం

కరోనా కష్టానికి మోడ్ చేసిందేమిటి? దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తూ మోడీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలన్నారు. సీపీఐ(ఎం)కు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేది కమ్యూనిస్టులే అన్నారు. కమ్యూనిస్టు దేశం చైనాలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. కానీ మనదేశంలో ఇంకా 30శాతం మందికి కూడా వ్యాక్ట్సినేషన్ పూర్తికాలేదని తెలిపారు. రూ.5 ఖర్చయ్యే వ్యాసిన్ను అడ్డుపెట్టుకుని మోడీ ప్రభుత్వం రూ.కోట్లు ఆర్జిస్తుందన్నారు. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 22వ హైదరబాద్లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా, వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 27న భారత బంద్, అక్టోబర్ 5న వారు రైతుల రాస్తారోకోను విజయవంతం చేయాల్సిందిగా తమ్మినేని పిలుపునిచ్చారు. కేసీఆర్ దళితులకు మూడు ఎకరాలు ఇస్తామని ప్రకటించి.. ఆ తర్వాత ఇవ్వకపోయినా దళితబందైన రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏకకాలంలో అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ డిమాండ్ చేశారు. సభకు ముందు ఖమ్మం నలుమూలల నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, బత్తుల హైమావతి, ఏం, సుబ్బారావు, పి.సోమయ్య, విద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, గిరిజన సంఘం నాయకులు భూక్యా వీరభద్రం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గన్నారు.

 

 

Related posts

వైసీపీకి మింగుడు పడని నెల్లూరు జిల్లా రాజకీయాలు …!

Drukpadam

ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి!

Drukpadam

పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారా…?

Drukpadam

Leave a Comment