Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి లో భారీ దొంగతనం!

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి లో భారీ దొంగతనం!
-బతుకమ్మ సంబరాలకు వెళ్లిన కుటుంబసభ్యులు …50 లక్షల బంగారం ,వెండి చోరీ
-పట్టపగలు దారుణం …తలుపులు పగల గొట్టి బీరువా ధ్వంసం చేసి చోరీ
-ఇంటికి వచ్చిన చూసుకున్న కుటుంబసభ్యులు లబోదిబో
-తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు …
-సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు …

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లోని కుర్నవల్లి లో భారీ చోరీ జరిగింది. దసరా పండగ రోజు బతుకమ్మ చివరి రోజు కావడంతో గ్రామస్తులంతా ఆ వేడుకల్లో ఉన్నారు. గ్రామానికి చెందిన రైతు కట్టా దుర్గారావు రావు ఇంట్లో వారు కూడా ఆ వేడుకలకు వెళ్లారు. చాలాసేపటి తరువాత వారు ఇంటికి వచ్చారు. వచ్చినతరువాత యధాలాపంగా ఇంటిముందు తాళం తీసుకోని లోనికి వెళ్లి చేసే సరికి బీరువా తెరిచి ఉండటం దుస్తులు చిందరవందరగా ఉండటంతో లబోదిబో మంటూ నా బంగారం పోయిందని భార్య కేకలు వేసింది. భర్త పక్కనే నీటి తొట్టి దగ్గర కళ్ళు కడుగుతున్నాడు . భార్య అరుపులకు ఏమైందోనని వచ్చాడు . ఆమె మొత్తుకుంటూ బంగారం , వెండి డబ్బులు పోయానని చెప్పడంతో దుర్గారావు ఆశ్చర్య పోయాడు . వెంటనే తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లాడ ఎస్ ఐ వచ్చి పరిసరాలను పరిశీలించారు. అంతే కాకుండా ఖమ్మం నుంచి పోలీస్ జాగిలాలను తెప్పించారు.క్లూస్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. మొత్తం 50 లక్షల బంగారం , 4 లక్షల వెండి . కొంత డబ్బు ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related posts

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి

Ram Narayana

ఢిల్లీ లిక్కర్ కేసు…శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించింది…రిమాండ్ రిపోర్ట్ లో సిబిఐ

Ram Narayana

కంపెనీ డబ్బుతో భార్యకు శాండ్విచ్ కొనిచ్చి ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి!

Ram Narayana

Leave a Comment