Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునాతీరే…

కాంగ్రెస్ లో ఎవరికీ వారే యమునాతీరే…
ఒకవైపు కోమటి రెడ్డి మరో వైపు ప్రేమ్ సాగర్ రావు కమ్ముకొస్తున్న అసమ్మతి
ఇక రేపట్నించి చూస్కోండి… సమరశంఖం పూరించిన కోమటిరెడ్డి
ఉద్యమం ప్రారంభిస్తున్న కోమటిరెడ్డి
కామారెడ్డి జిల్లాలో మృతి చెందిన కుటుంబానికి రేపు పరామర్శ
కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడి
పార్టీ కోసం ఏంచేయాలో ఆలోచిస్తున్నామని వివరణ

కాంగ్రెస్ లో పరిస్థితి ఎవరికీ వారే యమునాతీరే అన్న చందంగా ఉంది…ఇప్పటీకే సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు.దీనికితోడు హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘోర పరాజయం కనీసం డిపాజిట్లు దక్కకపోవడం తో ఒక్కసారిగా అసమ్మతి గళాలు పెరిగాయి. పీసీసీ పదవికోసం చివరిదాకా ప్రయత్నించి అదిరాకుండా పోయేసరికి తీవ్ర అసంతృప్తితో ఉన్న భవనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు . హుజురాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వడంవల్ల గెలిచాడని అర్థం వచ్చే ఇదంగా మాట్లాడారు . ఇప్పుడు యాత్రలకు సిద్ధమైయ్యారు. తన తడాకా చూపిస్తానని అంటున్నారు . ఇక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు తన జిల్లాలో కొత్తగా వచ్చినవారికి పదవులు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ న్యాయం చేయకపోతే కొత్త పార్టీ పెట్టేందుకు అయినా వెనుకాడనని స్పష్టం చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే పీసీసీ ఉపాధ్యక్షుడు జగ్గారెడ్డి కూడా హుజురాబాద్ ఎన్నికలపై ఘాటుగా స్పందించారు. కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితిపై ఎటు దారితీస్తుందో అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని, అధినేత్రి సోనియా గాంధీ తన దేవతని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేపటి నుంచి తన ఉద్యమం షురూ అవుతుందని, ఇక తానేంటో చూపిస్తానని అన్నారు.

ఇవాళ సీనియర్ నేత వీహెచ్ తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ సాకారమైందంటే అందుకు సోనియానే కారణమని తెలిపారు. కానీ అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉందని, పార్టీ పునర్ వైభవం కోసం ఏంచేయాలో ఆలోచిస్తున్నట్టు కోమటిరెడ్డి వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.

కామారెడ్డి జిల్లా లింగంపేటలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని కలుస్తానని, రేపు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక, కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ దశలో పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన ఆయన, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినా, తన వ్యాఖ్యలతో అసంతృప్త నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Related posts

బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి గుడ్​బై.. కర్ణాటకలో కొత్త పార్టీ ప్రకటన!

Drukpadam

ఖమ్మం టీఆర్‌ఎస్‌ లో భారీ చేరికలు … మంత్రి పువ్వాడ

Drukpadam

డ్రామా రాజకీయాలను జగన్ మానుకోవాలి: జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

Leave a Comment