Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

జర్మనీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!

జర్మనీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి!
పలుదేశాల్లో మరోసారి కరోనా కలకలం
జర్మనీలో నిన్న 39 వేలకు పైగా కేసులు
ఆసుపత్రులకు పోటెత్తుతున్న బాధితులు
వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే కారణమంటున్న నిపుణులు

కొద్దినెలల క్రితం కరోనా …కరోనా అంటూ మార్మోగింది ప్రపంచం …నేడు అది తగ్గుముఖం పట్టడంతో అనేక దేశాలు విధించిన ఆంక్షలు సైతం సడలించాయి.పలు దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంబిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మహమ్మారి ఇంకా పోలేదని దాని ప్రభావం ఇంకా పొంచు ఉందని జర్మనీ లో రోజు వారు వస్తున్నా కేసుల సంఖ్య తెలియజేస్తున్నది .అందువల్ల కరోనా డెంజర్ బెల్స్ మోగుతున్నాయనే సత్యాన్ని గ్రహించి ముందు జాగ్రత్తలు చేపట్టాలని అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. భౌతిక దూరం పాటించడం , మాస్క్ లు ధరించడం టెస్టులు చేయించుకోవడం లక్షణాలు ఉంటె ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లాంటివి చేయాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ప్రజలు ఇష్టం వచ్చినట్లు తమరోజువారి కార్యక్రమాలు కరోనా నిబంధనలు పాటించకపోతే తిరిగి మహమ్మారి విజృభించే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్నది .

జర్మనీలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేలా ఉంది. నిన్న ఒక్కరోజే జర్మనీలో 39 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. దేశంలోని ఆసుపత్రులకు తరలి వస్తున్న కరోనా బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయింది. ఐసీయూల్లో ఖాళీలు లేని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చే రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకోలేకపోతున్నామని అక్కడి వైద్య సిబ్బంది నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది మొత్తం కరోనా రోగుల బాగోగులు చూసుకోవడానికి సరిపోతున్నారని, ఇతర కేసుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించలేకపోతున్నామని ఓ ఆసుపత్రి యజమాన్యం వాపోయింది.

కాగా, జర్మనీలో కరోనా మళ్లీ ఈ స్థాయిలో విజృంభించడానికి ఇంకా చాలామంది వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే కారణమని నిపుణులు భావిస్తున్నారు. కొత్త కేసుల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే దేశంలో లాక్ డౌన్ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం అవుతుంది.

Related posts

చైనాలో కరోనా కల్లోలం.. 50 వేలకుపైగా కేసుల నమోదు!

Drukpadam

కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచండి: ప్రధాని మోదీ!

Drukpadam

తెలంగాణ లో లాక్‌డౌన్ మరో 10 రోజుల పొడిగింపు ….

Drukpadam

Leave a Comment