Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో చల్లారని హుజురాబాద్ కాక…మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచల కామెంట్స్!

కాంగ్రెస్ లో చల్లారని హుజురాబాద్ కాక…మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచల కామెంట్స్!
కాంగ్రెస్ పార్టీ తీరు మారకపోతే తుడిచిపెట్టక పోవడం ఖాయంమని హెచ్చరిక
సొంతం స్వార్థం తో పార్టీని నట్టేట ముంచుతున్నారు
కొందరు నేతలు టీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారు
నాయకుల మధ్య సమన్వయ లోపమే హుజూరాబాద్ ఓటమికి కారణం
సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్ ఓటమిలపై కూడా సమీక్ష నిర్వహించాలి
చరిత్రగల పార్టీని చరిత్ర హీనంగా చేస్తున్నారు

హుజూరాబాద్ ఉపఎన్నిక వేడి తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా చల్లారలేదు. ఈరోజు కాంగ్రెస్ అధిష్ఠానం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ నాయకుల తీరు మారకపోతే తుడిచిపెట్టకపోవడం ఖాయమని హెచ్చరించారు . ఒకరిపై ఒకరు నిందలు , సొంతం ,స్వార్థం ,పదవుల ఆశతో పలువురు పార్టీకి ద్రోహం చేశారని సంచలన కామెంట్స్ చేశారు.

నాయకుల మధ్య సమన్వయ లోపమే పార్టీ ఓటమికి కారణమని చెప్పారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన కె. కేశవరావు, డి. శ్రీనివాస్ లు రాజ్యసభ పదవుల కోసం కాంగ్రెస్ కు మోసం చేశారని అన్నారు. ఇప్పుడు మరో మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కజిన్ బ్రదర్ కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారని మండిపడ్డారు.

పద్ధతి మార్చుకోకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు సహకరిస్తున్నారని విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ఓటమిపైనే కాకుండా నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూర్ నగర్ ఓటమిలపై కూడా సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ పని తీరు ఇలాగానే ఉంటె పార్టీ మనుగడ ప్రశ్నర్థకంగా ఉంటుందని అన్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు కేవలం 3 వేల ఓట్లే ఉన్నాయా ? మనలో కొందరు బీజేపీ కు అనుకూలంగా పనిచేశారు. మన అభ్యర్థి ఎలాగూ గెలవడని మనమే ముందుగానే ఓక్ అంచనాకు వచ్చాం .దీంతో టీఆర్ యస్ ను ఓడించాలనే ఉన్న ఓటర్లు బీజేపీకి ఓట్లు వేశారు. ఇందుకు నాయకత్వమే భాద్యత తీసుకోవాలని అన్నారు. సమిష్టి తత్వం లోపించిందని అభిప్రాయాలు కూడా పార్టీ సీనియర్లు వినిపించినట్లు సమాచారం . ఒంటెత్తు పోకడలు , పెత్తందారీ తనం ,ఏకపక్ష నిర్ణయాలు పార్టీని పెంచక పొగ పాతాళంలో పడేస్తాయనే హెచ్చరికలను సీనియర్లు చేసినట్లు తెలుస్తుంది.

Related posts

ఎర్రకోటపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే… బీఆర్ఎస్ నినాదం ఇదే: కేసీఆర్!

Drukpadam

వనమా ను ఆత్మీయ సమ్మేళనాలు పెట్టవద్దని ఆదేశాలు అబద్దం ..ఆయన వర్గం…

Drukpadam

బొత్స సంగతి సరే… చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని!

Drukpadam

Leave a Comment