Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఖమ్మంలో ఘన స్వాగతం!

హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఖమ్మంలో ఘన స్వాగతం
-బిజెపి పార్టీ నాయకులు , శ్రేణులు మరియు బహుజనులు.
ధన్యవాదాలు తెలిపిన ఈటల
-కొత్తగూడెం లో ఒక ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈటల
-ఖమ్మం స్వాగతం పలికిన పొంగులేటి తదితరులు
-టపాసులు పేల్చిన అభిమానులు బీజేపీ కార్యకర్తలు

ఇటీవల జరిగిన ఎన్నికల్లో హుజురాబాద్ లో గెలిచి తనసత్తా చాటిన అనంతరం ఖమ్మం ,నల్గొండ జిల్లాల మీదగా , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చిన ఈటల రాజేందర్ కు దారిపొడవునా అభిమానులు ,బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు .

నగరంలో ఆదివారం కోదాడ క్రాస్ రోడ్ నందు హుజరాబాద్ ఎమ్మెల్యే , ముదిరాజు ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ కు ముదిరాజ్ నాయకులు , బిజెపి పార్టీ నాయకులు , శ్రేణులు మరియు బహుజనులు శాలువాలతో సత్కరించి బొకేను అందజేసి టపాసులు పేల్చి ఘన స్వాగతం పలికారు . అనంతరం వారు మాట్లాడుతూ కొత్తగూడెం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతున్నట్టుగా హుజూరాబాద్ ఎలక్షన్ అనంతరం మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా ఖమ్మం రావడం చాలా ఆహ్లాదకరంగా ఉందని , నన్ను కలవడానికి వచ్చిన అభిమానులకు సంఘం నాయకులకు పార్టీ శ్రేణులకు నాయకులకు రుణపడి ఉంటానని అన్నారు .

అంతకు ముందు ఆయన నల్గొండ జిల్లా లోను ఘనస్వాగతం లభించింది. తరువాత ఆయన ఖమ్మం జిల్లాలో ప్రవేశించారు. ఖమ్మం కొణిజర్ల ,వైరా , తల్లాడ , ఏన్కూర్ , జూలూరుపాడు ,కొత్తగూడెం లలో ఈటల కోసం అభిమానులు బీజేపీ కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. ఈటల జిందాబాద్ , ఈటల నాయకత్వ వర్ధిల్లాలి లాంటి నినాదాలు మారుమోగాయి .

Related posts

ఈటల భారీ కుట్రకు ప్లాన్ చేశారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు!

Drukpadam

పంజాబ్ సీఎం భ‌గవంత్‌కు షాక్‌… సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి!

Drukpadam

నిమిషాల వ్యవధిలో ట్విస్ట్.. కాంగ్రెస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్!

Drukpadam

Leave a Comment