Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గత ఒప్పందాల ప్రకారమే ధాన్యం కొనుగోలు: కిషన్‌రెడ్డి

గత ఒప్పందాల ప్రకారమే ధాన్యం కొనుగోలు: కిషన్‌రెడ్డి
ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడ చెప్పలేదు
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం లేఖ ఇచ్చింది
ఈ సీజన్ లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుంది.
కేసీఆర్ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి
వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రం విఫలమైంది

 

గత ఒప్పందాల ప్రకారమే రాష్ట్రం నుంచి కేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తుందని కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనబోమని కేంద్రం ఎక్కడ చెప్పలేదని అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లేఖ ఇచ్చిన రాష్ట్రం ఇప్పుడు బాయిల్డ్ కొనాలని చెప్పడంలో అర్థం లేదని అన్నారు. రైతుల విషయంలో కేంద్రాన్ని బ్లమ్ చేయాలనీ చూస్తందని కిషన్ రెడ్డి మండి పడ్డారు . రైతులకు వరి విత్తనాలు అందించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలేంటన్నారు. ప్రతిదానికి కేసీఆర్ అసంబద్ధ మైన వాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా బాయిల్డ్ రైస్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు .
ప్రతిదీ కేంద్ర ప్రభుత్వంపై తోసేస్తున్నారని ఆరోపించారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయబోమని ఎక్కడా చెప్పలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులను ఆందోళనకు గురిచేస్తోందని మండిపడ్డారు.

బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఈ సీజన్‌లో చివరి బస్తా వరకు కేంద్రం కొంటుందని ఆయన పేర్కొ్న్నారు.

Related posts

ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగితే షర్మిల అయినా , మరెవరైనా ఊరుకోం: సజ్జల…

Drukpadam

సిబిఐ విచారణకు నేను సిద్ధం నీవు సిద్దమేనా :హరీశ్ రావుకు సవాల్ విసిరిన ఈటల!

Drukpadam

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

Drukpadam

Leave a Comment