ధాన్యం కొనకపోతే ఆందోళనలు ఉదృతం …ఈనెల 7 న మండల కేంద్రాలలో ధర్నాలు!
-సిపిఎం,సిపిఐ ,సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ , టీడీపీ , టి జె ఎస్ , ఇంటి పార్టీ పిలుపు
-వడ్ల కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు కట్టిపెట్టాలి
-డ్రామాలు ఆపి వెంటనే రైతుల వద్ద వడ్లు కొనాలి …
రైతుల వద్ద నుంచి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఖమ్మం జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నేతల దుయ్యబట్టారు . ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతులను మోసం చేస్తున్నాయని వారు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళనలు చేయాలనీ రాష్ట్ర నాయకత్వం పిలుపు నిచ్చిందని అన్నారు. ఆ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు చేయాలనీ వారు కోరారు .
వరి ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేస్తూ, డిసెంబర్ 7న మండల కేంద్రాల్లో రాస్తా రోఖో, కల్లాల వద్ద దీక్షలు చేయాలని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ,సిపిఎం , టీడీపీ , టీజె ఎస్ , ఇంటి పార్టీ రాష్ట్ర కమిటీ లు పిలుపును ఖమ్మం జిల్లాలో అమలు చేయుటకు రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలోఆదివారం సమావేశం జరిగింది. సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఐ జిల్లా నాయకులు కొండపర్తి గోవిందరావు పాల్గొన్నారు.7న మండల కేంద్రాలలో రాస్తా రోఖోలను జయప్రదం చేయాలని కోరారు.