Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నాగాలాండ్ ఘటనపై లోక్ సభలో ప్రకటన చేసిన అమిత్ షా!

లోకసభలో నాగాలాండ్ ప్రకంపనలు …అమిత్ షా ప్రకటన
నాగాలాండ్ ఘటనపై లోక్ సభలో ప్రకటన చేసిన అమిత్ షా
నాగాలాండ్ లో భద్రతా బలగాల కాల్పులు
తీవ్రవాదులు అనుకుని పౌరులపై కాల్పులు
ఆరుగురి మృతి.. తిరగబడ్డ గ్రామస్థులు
మరోసారి కాల్పులు జరిపిన సైన్యం
ఈసారి ఏడుగురి మృతి

నాగాలాండ్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అమాయకులులైన పౌరులు 13 మంది మరణించిన సంఘటన ఈరోజు పార్లమెంట్ ను కుదిపివేసింది. ఇది అత్యంత విషాదమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పౌరులను ఉగ్రవాదులుగా భావించి కాల్పులు జరిపిన ఘటన పై చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. దీనిపై హోమ్ మంత్రి ప్రకటన ఉంటుందని ప్రభుత్వం తెలిపింది . హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటన చేసారు. అత్యంత ఘోరతప్పిదానంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.

నాగాలాండ్ లో భద్రతాబలగాలు పొరబాటున సామాన్య పౌరులపై కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. పౌరులను తీవ్రవాదులుగా భావించిన భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో తొలుత ఆరుగురు మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భద్రతా బలగాలపై దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం మరోసారి కాల్పులు జరపగా మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాగాలాండ్ ను భగ్గుమనేలా చేసింది.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి కిందట లోక్ సభలో ప్రకటన చేశారు. ఆత్మరక్షణ కోసమే సైనిక బలగాలు కాల్పులు జరిపాయని వెల్లడించారు. నాగాలాండ్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. నాగాలాండ్ ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఘటనపై నాగాలాండ్ ఉన్నతాధికారులతోనూ చర్చించామని వివరించారు.

ఈ ఘటనపై సైన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసిందని, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిందని అమిత్ షా వెల్లడించారు. ఈ దురదృష్టకర ఘటనపై సైన్యం కూడా ఉన్నతస్థాయి విచారణ జరుపుతుందని తెలిపారు. కాగా, ఇదే అంశంపై కొద్దిసేపట్లో అమిత్ షా రాజ్యసభలోనూ ప్రకటన చేయనున్నారు.

 

Related posts

పదవిలో కొనసాగే నైతిక అర్హత అమిత్ షాకు లేదు…కాంగ్రెస్

Drukpadam

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటు చట్ట విరుద్ధం: ఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం!

Drukpadam

ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు తెరవెనుక …ఇప్పుడు తెరముందుకు!

Drukpadam

Leave a Comment