Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాత బస్ స్టాండ్ ఉద్యమం పై మంత్రి పువ్వాడ ఆగ్రహం…

పాత బస్ స్టాండ్ ఉద్యమం పై మంత్రి పువ్వాడ ఆగ్రహం
పాత బడిన పార్టీలుపాతరేయబడ్డ పార్టీలు చేస్తున్న ఉద్యమాలకు కాలం చెల్లింది
ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కు మంత్రి ముళ్లు కర్ర పట్టుకొని ఉంటాడు
ఆస్తులు ఎక్కడికో పోతున్నట్లు చీలవలు పలవలు చేయటం మానుకోవాలి
పాత స్థలాలు ప్రజా అవసరాలకోసం ఉపయోగిస్తాం
దయచేసి ఉద్యమాన్ని విరమించుకోవాలి
పాత బస్ స్టాండ్ పరిరక్షణ పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఉద్యమం పై జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు.శనివారం టీఆర్ యస్ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో పాత బస్ స్టాండ్ ఉద్యమంపై తీవ్రంగా స్పందించారు. పాత బడిన పార్టీలుపాతరేయబడ్డ పార్టీలు చేస్తున్న ఉద్యమాలకు కాలం చెల్లిందని మంత్రి ఘాటైన పదజాలంతో ఉద్యమం చేస్తున్న పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . మంత్రి ఒక్క గజం స్థలంకూడా పోనివ్వడు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కు మంత్రి ముళ్లు కర్ర పట్టుకొని ఉంటాడు.
ఆస్తులు ఎక్కడికో పోతున్నట్లు చీలవలు పలవలు చేయటం పార్టీలు మానుకోవాలని హితవు పలికారు . ఆర్టీసీ స్థలాలు ప్రజా అవసరాలకోసం ఉపయోగిస్తాం రాష్ట్రంలో జరిగేది అదే ,అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయటం తగదన్నారు. ఇప్పటికే అనేక చోట్ల ఆర్టీసీ స్థలాలలో కళ్యణ మండపాలు కట్టాము ,బంక్ లు ఏర్పాటు చేశాము , కాంప్లెక్సులు కట్టాం, ఖాళీ స్థలాలను ప్రజా అవసరాలకోసం ఉపయోగిస్తున్నాం .పాత పంధాలో పాతబడిన పార్టీలు , పాతర వేయబడ్డ పార్టీలు చేస్తున్న ఉద్యమాలను దయచేసి విరమించుకోవాలని మంత్రి అన్నారు. అంతే కానీ ఆర్టీసీ ఆస్తులు ఎవరో కొట్టి వేస్తున్నట్లు తప్పదు ప్రచారం చేయటం తగదన్నారు. ఇప్పటికైనా పార్టీలు గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు. విలేకర్ల సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం , రాష్ట్ర విత్తనాభువృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , రాష్ట్ర పార్టీ కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాహనాల కుదింపు…

Drukpadam

పాములు పోతాయని పొగపెడితే.. రూ. 13 కోట్ల విలువైన ఇల్లు కాలిబూడిదైంది!

Drukpadam

కుప్పం పైనే అందరి కళ్ళు …వైసీపీ వర్సెస్ టీడీపీ హోరాహోరీ!

Drukpadam

Leave a Comment