Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మేడారం గిరిజన జాతరకు చురుగ్గా ఏర్పాట్లు…

మేడారం గిరిజన జాతరకు చురుగ్గా ఏర్పాట్లు…
-ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర
-మేడారంకు 3,845 బస్సులు.. 50 ఎకరాల్లో భారీ బస్టాండ్
-హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులు
-జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచి మేడారం జాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో లక్షలాది మంది వచ్చే ఈ జాతరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ శానిటైజ్ చేయడంతో పాటు జాతర మార్గాలలో , జాతర దగ్గర వందల క్యాంపు లను ఏర్పాటు చేయనున్నది . ప్రత్యేకంగా గిరిజనలు ఈ జాతరకు పోటెత్తుతారు …వారు అక్కడే రెండు మూడు రోజులు మకాం వేస్తారు …అందువల్ల ప్రభుత్వం మూడు జాగ్రత్తలు తీసుకోని ఎప్పటికప్పుడు ప్రజలను పంపించేందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 3,845 బస్సులను నడపాలని నిర్ణయించారు. ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు నడిపాలని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు. అంతేకాదు మేడారంలో బస్సుల కోసం 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. టికెట్లు క్యూ కోసం స్థలాన్ని చదును చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

మరోవైపు మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో శానిటేషన్‌ వంటి ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

Related posts

పాలేరులో తుమ్మల అనుచరుల తిరుగుబాటు …కందాల ఓటమే ద్యేయంగా పనిచేయాలని నిర్ణయం…

Ram Narayana

అకాల వర్షాలపై అధికారులతో సీఎం కేసీఆర్  సమీక్ష…!

Drukpadam

యుద్ధ ప్రభావం … భగ్గుమన్న డీజిల్ ధరలు లీటర్ పై రూ.25 పెంపు…

Drukpadam

Leave a Comment