మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కు కరోనా పాజిటివ్!
ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం తిరిగొచ్చిన ఎర్రబెల్లి
ఈ ఉదయం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు
ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో ఉన్న మంత్రి
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. రాష్ట్ర సమస్యలకు సంబంధించి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనను ముగించుకుని నిన్న రాత్రి ఆయన హైదరాబాదుకు చేరుకున్నారు.
ఈ రోజు ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలను చేయించుకోవాలని కోరారు. తాను ఐసొలేషన్ లో ఉన్నన్ని రోజులు తనను కలిసేందుకు ఎవరూ రావద్దని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు తన పీఏలు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎర్రబెల్లికి కరోనా సోకినా విషయం తెలియగానే సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం . రాష్ట్రానికి చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు , ఎంపీ లు ఇతర ప్రముఖులు ఆయన్ను ఫోన్ పరామర్శించినట్లు టీఆర్ యస్ వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో అవసరంలేదని హోమ్ క్వారంటైన్ సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.