Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

థియేటర్లు మూతపడుతుంటే ఏడుపు వస్తుంది : ఆర్ నారాయణ మూర్తి!

థియేటర్లు మూతపడుతుంటే ఏడుపు వస్తుంది : ఆర్ నారాయణ మూర్తి!
-సినీ పెద్దలు తక్షణమే జోక్యం చేసుకోవాలి
-ఇది పరిశ్రమకు మంచిదికాదు
-ఇది ఇలానే కొనసాగితే గడ్డుపరిస్థితులు ఖాయం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు సినిమా పరిశ్రమ మధ్య సినిమా టికెట్ల విషయంలో రగడ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే హీరోలు నాని, సిద్ధార్థ్, నిఖిల్ తో పాటు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై పలు వ్యాఖ్యలు చేశారు.

తాజా గా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల విషయం పై స్పందించారు. ఈ రోజు హైదరాబాద్ లో హీరో నాని శ్యామ్ సింగ రాయ్ సక్సస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో థీయేటర్లు మూత పడుతుంటే తనకు ఏడుపు వస్తుందని అన్నారు. సినిమాలు తీసేవాడు, చూపేవాడు, చూసే వాడు ఉంటేనే సినిమా పరిశ్రమకు మంచి రోజులు, మనుగడ ఉంటాయని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో థీయేటర్లను మూసివేయవద్దని ఆయన అన్నారు. ఈ విషయం పై తెలుగు సినిమాల నిర్మాతల మండలి, మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలుగు సినీ పరిశ్రమ మనుగడకే ప్రమాదం అని అన్నారు. పండుగ సమయాల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి గడ్డు పరిస్థితి తీసుకురావద్ధని అన్నారు.

హీరో నానికి మద్దతు పలికిన దిల్ రాజు

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో నాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ ని తగ్గించడంపై నాని తనదైన శైలిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

టాలీవుడ్ లో ఐక్యత లేదు అని , వకీల్ సాబ్ సినిమా అప్పుడు మొదలైన ఈ సమస్యకు అప్పుడే పరిష్కారం వెతకాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ప్రస్తుతం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. నాని వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు పెదవి విరుస్తుండగా.. మరికొందరు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఇక తాజాగా నాని వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ ఇచ్చారు. నేడు శ్యామ్ సింగరాయ్ సక్సెస్ మీట్ కి అతిధిగా విచ్చేసిన దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడుతూ ” ఇటీవల నాని చేసిన వ్యాఖ్యలను అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు.. నాని చెప్పిన విషయం వేరు.. అది వెళ్లిన తీరు వేరు. నేను, నానితో చేసిన వి మూవీ ఓటిటీ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడు కూడా నానికి, డిస్టిబ్యూటర్స్ కి గొడవ అయ్యింది. ఇలా రెండు సినిమాలు ఓటిటీ కి వెళ్లి వచ్చాకా ఇప్పుడు తన సినిమా థియేటర్లో రిలీజ్ కావడం, ఇలాంటి సమయంలో టికెట్ ఇష్యూ రావడం వలన, ఒక హీరోగా కష్టపడే మనస్తత్వంతో ఉన్న నాని ఎమోషనల్ అయ్యి అలా రియాక్ట్ అయ్యాడు.

Related posts

బండ్ల గణేశ్ పై మండిపడ్డ జీవిత..అదే స్థాయిలో బండ్ల గణేష్ ఫైర్!

Drukpadam

రాహుల్ పై ఈడీ విచారణ …కేంద్రానిది దుర్మార్గ వైఖరి అని శివసేన మండిపాటు …

Drukpadam

పార్లమెంట్​లో ఈ పదాలు ఇక వాడకూడదు.. బుక్ లెట్ విడుదల!

Drukpadam

Leave a Comment