Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కొవిడ్‌ కట్టడి చర్యలు జనవరి 31 వరకు పొడిగింపు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ!

కొవిడ్‌ కట్టడి చర్యలు జనవరి 31 వరకు పొడిగింపు.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
-ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం ఆందోళన
-కొత్త వేరియంట్ కారణంగా సవాళ్ళను ఎదురుకోనేదుకు సిద్ధంగా ఉండాలి
-ఆక్సిజన్ ,మండల కొరత లేకుండా చూడాలి
-కట్టు దిట్టమైన చర్యలకు కేంద్ర రాష్ట్రాలకు ఆదేశం
-స్థానిక ఆంక్షలు రాష్ట్రాల ఇష్టం

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంపై.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా కొవిడ్‌ నియంత్రణ చర్యల అమలును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఎక్కడా నిబంధనలు సడలించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పండగ సీజన్‌లో రద్దీని నియంత్రించేందుకు అవసరం అనుకుంటే స్థానికంగా ఆంక్షలు, పరిమితులు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు.

వ్యక్తిగత దూరం, కొవిడ్‌ నిబంధనల అమలుకు 144 సెక్షన్‌ విధించొచ్చని భల్లా తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా చర్యలు చేపట్టాలన్నారు. కొత్త వేరియంట్ కారణంగా ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థలను పటిష్ఠం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఆక్సిజన్ లభ్యత, మందుల స్టాక్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం సోమవారం నాటికి దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 578కి చేరుకున్న విషయం తెలిసిందే.

Related posts

పరిస్థితులు కుదట పడ్డాకనే ఎమ్మెల్సీ ఎన్నికలు :సీఈ సి…

Drukpadam

ఐపీఎల్ నిలిచిపోవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఆస్ట్రేలియన్లు!

Drukpadam

ఫైజర్ వ్యాక్సిన్ పై ఇజ్రాయెల్ ఫిర్యాదు.. సమీక్షిస్తామన్న ఫైజర్!

Drukpadam

Leave a Comment