Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అంగీకారం లేకుండా మహిళ పాదాలను తాకినా నేరమే: బాంబే హైకోర్టు!

అంగీకారం లేకుండా మహిళ పాదాలను తాకినా నేరమే: బాంబే హైకోర్టు!
-అర్ధరాత్రి వేళ తన ఇంటికి వచ్చి పాదాలు తాకాడని మహిళ ఫిర్యాదు
-ఏడాది జైలు శిక్ష విధించిన కింది కోర్టు
-హైకోర్టులోనూ నిందితుడికి చుక్కెదురు
-అంగీకారం లేకుండా శరీరంలోని ఏ భాగాన్ని తాకినా నేరమేనని స్పష్టీకరణ

అనుమతి లేకుండా మహిళ పాదాలు సహా శరీరంలోని ఏ భాగాన్ని తాకినా నేరమేనని బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. ఓ కేసును విచారిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన పొరిగింటి వ్యక్తి ఒకరు రాత్రి 11 గంటల వేళ తన ఇంటికి వచ్చి తన పాదాలు తాకాడని ఆరోపిస్తూ 5 జులై 2014న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన స్థానిక కోర్టు నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు.

విచారణ సందర్భంగా నిందితుడి తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్ ఆమె ఇంటికి వెళ్లి పాదాలను తాకడం నిజమేనని.. అయితే, అందులో లైంగిక ఉద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. ఈ వాదనను కోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది. మహిళ అంగీకారం లేకుండా ఆమె నిద్రపోతున్న మంచం మీద కూర్చుని పాదాలను తాకడం ఆమె గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని తేల్చి చెప్పింది. అర్ధరాత్రి పరిచయం లేని వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడితే దానిని ఆమె గౌరవానికి భంగం కలిగించినట్టుగానే భావించాలని జస్టిస్ సెవ్లీకర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.

Related posts

శాంతి భద్రతలపై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం …జగన్ పై విసుర్లు

Ram Narayana

చంద్రబాబుకు హైకోర్టులో ఊరట.. తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు

Ram Narayana

మోదీ ప్రారంభించిన 5 రోజులకే కోత‌కు గురైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వే…

Drukpadam

Leave a Comment