ఖమ్మం జిల్లా టీఎన్జీఓ నూతన కార్యవర్గం కొత్త వరవడి!
–మాజీ నేతల ఇళ్లకు వెళ్లి సత్కరిస్తున్న వైనం
–వారి ఆశీర్వచనాలు తీసుకుంటున్న నేతలు
–అధికారులని ,ముఖ్యనేతల దీవెనలు తీసుకుంటున్నారు
ఖమ్మం జిల్లా టీఎన్జీఓ నూతన కార్యవర్గం కొత్త వరవడి శ్రీకారం చుట్టింది . గత కొంత కాలంగా వర్గాలుగా గ్రూపులుగా విడిపోయి తగాదాలు పడ్డారు .ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. చివరకు ప్రతిసారి ఏకగ్రీవం అయ్యే హోసింగ్ సొసైటీ లో సైతం రెండు వర్గాలు పోటీపడి ఎన్నికల దాకా వెళ్లారు . రంగరాజు అధ్యక్షుడిగా ఉండి ఆయన రిటైర్ అయిన తరువాత పొట్ట పింజర రామయ్య ను అధ్యక్షుడిగా నియమించారు. ఆయన సుమారు మూడు పర్యాయాలు పదవిలో ఉండి గ్రూప్ తగాదాలతో బదిలీ అయ్యారు . దీంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవిని జిల్లా టీఎన్జీఓ లో కీలకంగా వ్యవహరిస్తున్న అఫ్జల్ ను రాష్ట్ర సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. కార్యదర్శిగా ఆర్ వి ఎస్ ఎస్ ఆర్ సాగర్ ను నియమించారు. ఇద్దరు ఉత్సాహవంతులు కావడంతో సంఘం తిరిగి గాడిలో పడుతుందని ఉద్యోగవర్గాలు ఆశతో ఎదురు చూస్తున్నారు .
అఫ్జల్ ,సాగర్ లు పదవి భాద్యతలు స్వీకరించారు…. వీరు నియకామం అయినతరువాత ఉద్యోగసంఘాలతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు.సంఘంలో పని చేసిన మాజీనేతలను వారి ఇళ్లకు వెళ్లి సత్కరిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చాలాకాలం సంఘంలో పనిచేసిన మల్లంపాటి సుధాకర్ , సైదయ్య , రంగరాజు లను సత్కరించడంతోపాటు , వారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. తరువాత వారు సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ ను కలిసి సత్కరించారు.
అన్ని డిపార్ట్మెంట్లలో సంఘాలని పునర్నిర్మాణం చేసే పనిలో నిమగ్నమైయ్యారు. ఇప్పటికే వివిధ శాఖల్లో కమిటీలని నియమించారు. ఉద్యోగులు రోజు వారి ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు కొత్త నాయకత్వం చొరవచూపాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రస్థాయిలో ఉన్న సమస్యలతోపాటు , స్థానికంగా బదిలీలు పోస్టింగ్ లలో యూనియన్ నేతల సహాయం కోరుతుంటారు . అంతే కాకుండా ఉద్యోగుల ఇళ్ల స్థల సమస్య , టీఎన్జీఓ కాలనీల్లో రోడ్లు మంచినీరు , ఆటస్థలాలు లైబ్రరరీ లాంటి సదుపాయాలు కల్పించేందుకు యూనియన్ నేతలు కృషి చేయాలనీ ఉద్యోగులు కోరుకుంటున్నారు. అనేక మందికి ఇళ్ల స్థలాల సమస్య పరిస్కారం కావాల్సి ఉంది. దీనిపై నాయకత్వ భాద్యతలు స్వీకరించిన అఫ్జల్ ,సాగర్ లు ఉద్యోగులని ఎలా మెప్పించి ఒప్పిస్తారో చూడాలి మరి !