Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

టికెట్స్ ధరల విషయంలో నాగార్జున షాకింగ్ కామెంట్స్ …

టికెట్స్ ధరల విషయంలో నాగార్జున షాకింగ్ కామెంట్స్ …
-టికెట్ ధరల విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు: నాగార్జున
-టికెట్ ధర ఎక్కువుంటే ఎక్కువ డబ్బులొస్తాయి
-రేటు తక్కువుంటే తక్కువ డబ్బులొస్తాయి
-ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేం

ఏపీ లో సినీ టికెట్స్ ధరల పెంపుదల విషయంలో ఒకపక్క మాటల యుద్ధం నడుస్తున్న వేళ అగ్రనటుడు అక్కినేని నాగార్జున షాకింగ్ కామెంట్స్ చేశారు. టికెట్స్ రేట్లు పెంచిన పెంచకపోయిన తనకు అభ్యంతరంలేదన్నారు. పెంచితే ఎక్కువ డబ్బులు వస్తాయని పెంచకపోతే తక్కువడబ్బులు వస్తాయని అంతే తేడా ! అందువల్ల తీసిన సినిమాను జేబులో పెట్టుకొని తిరగలేం కదా అని అన్నారు. ఆర్జీవీ , మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంలో నాగార్జున మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ….

ఓవైపు ఏపీలో తగ్గిన టికెట్ ధరలు, మరోవైపు దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు టాలీవుడ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీల విడుదల వాయిదా పడింది. తాజాగా నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి నటించిన ‘బంగార్రాజు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా విడుదల తేదీని ఖరారు చేసేందుకు చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం నాలుగేళ్లుగా ఎంత కష్టపడిందో తనకు తెలుసని… ‘రాధేశ్యామ్’ సినిమా బృందం కూడా ఎన్నో ఏళ్లుగా శ్రమించిందని… ఈ సినిమాల విడుదల వాయిదా పడటం బాధను కలిగిస్తోందని నాగార్జున అన్నారు. ఇవి పాన్ ఇండియా చిత్రాలు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల కాకపోవడమే మంచిదని చెప్పారు. తమ సినిమాను మాత్రం విడుదల చేస్తున్నామని అన్నారు.

ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని… టికెట్ ధర ఎక్కువగా ఉంటే తమకు ఎక్కువ డబ్బులొస్తాయని, ధర తక్కువుంటే తమకు తక్కువ డబ్బులొస్తాయి అంతేనని నాగార్జున చెప్పారు. తమ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగోలేకపోయినా… సినిమాను జేబులో పెట్టుకుని ఉండలేమని చెప్పారు. అందుకే వసూళ్లు తక్కువగా వస్తాయని తెలిసినా సినిమాను విడుదల చేస్తున్నామని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడం వల్ల తమ సినిమాకు ఎంత లాభమనేది ఇప్పుడే చెప్పలేమని… సినిమా విడుదల తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

Related posts

సినీ పరిశ్రమపై చర్చించేందుకు చిరంజీవి బృందానికి సీఎం జగన్ పిలుపు!

Drukpadam

బామ్మర్ది సినిమాకు మినహాయింపులు ఇచ్చారు.. అదే చిరంజీవి అడిగినా ఇవ్వలేదు: చంద్రబాబుపై పేర్ని నాని విమర్శలు!

Drukpadam

సినీపరిశ్రమ పై సీఎం జగన్ కు పెద్ద మనసు …మెగాస్టార్ చిరంజీవి

Drukpadam

Leave a Comment