Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో కొత్త వివాదం…

ఏపీ సినిమా టికెట్స్ ధరల విషయంలో కొత్త వివాదం…
-ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందన్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి …ఆయన మాటలను తప్పు పట్టిన నిర్మాతల మండలి
-సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారన్న నల్లపురెడ్డి
-హైదరాబాదులో ఉంటున్న సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?
-టికెట్ ధర తగ్గితే సామాన్యులు కూడా సినిమా చూస్తారన్న ప్రసన్నకుమార్
-3 వేల పెన్షన్ డబ్బుతో బ్రతికేవాళ్లు ఉన్నారన్న మండలి
-ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై రగడ
-నిర్మాతలను బలిసినవాళ్లు అన్నాడంటూ మండలి ఆగ్రహం
-నిర్మాతల పరిస్థితిని వివరించిన మండలి
-ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోవాలని హితవు

సినిమా టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య జరుగుతున్నా యుద్ధంలో ఎవరిదీ తప్పు ఎవరిదీ ఒప్పు అనే చర్చ లో చాలామంది భాగస్వాములు అయ్యారు . సినీపరిశ్రమనుంచి అనేకమంది టికెట్స్ రేట్ల విషయంలో సర్కార్ కు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. మరికొందరు జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు . చివరకు ప్రతిపక్ష పార్టీలు కొన్ని అటు ఇటు కాకుండా సినిమా వాళ్ళను సమర్థించేలా వ్యవహరించాయి. ఇప్పడు వివాదాస్పద సినీ దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగాడు .దీనిపై నెల్లూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు .

సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య అగాధాన్ని పెంచుతోంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న హీరోలపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లపై పలు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా? అని ఎద్దేవా చేశారు. టికెట్ ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని… ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించారు. సినిమా వాళ్లంతా హైదరాబాదులోనే ఉంటున్నారని… వాళ్లకు ఏపీ ఎక్కడ గుర్తుందని నల్లపురెడ్డి అన్నారు. మంత్రి పేర్ని నానితో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయిన సమయంలో నల్లపురెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత అంశం నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిర్మాతల మండలి ప్రకటన విడుదల చేసింది. “నిర్మాతలు బలిసినవాళ్లు” అని కోవూరు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం బాధాకరమని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. ఈ వ్యాఖ్యలు చేయడం యావత్ చిత్ర పరిశ్రమను అవమానించడమేనని స్పష్టం చేసింది.

“తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమే. మిగిలిన సినిమాలు నష్టపోతుంటాయి. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ కు పని కల్పిస్తూ అనేక ఇబ్బందులు పడి, కోట్ల రూపాయల ఖర్చుతో సినిమాలు తీసే నిర్మాతలు చివరకు ఆస్తులు అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి కష్టనష్టాల బారినపడిన కొందరు నిర్మాతలు అన్ని విధాలా దెబ్బతిని చలనచిత్ర నిర్మాతల మండలి నుంచి నెలకు రూ.3 వేల పెన్షన్ తీసుకుంటున్నారు. దీన్ని బట్టే నిర్మాతలు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారో తేటతెల్లమవుతోంది. కానీ గౌరవనీయ ఎమ్మెల్యే వాస్తవాలు తెలుసుకోకుండా నిర్మాతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి” అంటూ నిర్మాతల మండలి డిమాండ్ చేసింది.

Related posts

పోలీసు వాహనంపై యువతి ఇన్‌స్టా రీల్స్‌కు అనుమతించిన అధికారిపై వేటు

Ram Narayana

సాయి గణేష్ కుటుంబసభ్యులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శ…

Drukpadam

నా ప్రజాసామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరు… గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తా: జేపీ నడ్డా!

Drukpadam

Leave a Comment