Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఖమ్మం లాడ్జిలో ఎఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య!

ఖమ్మం లాడ్జిలో ఎఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య!
-నిశ్చతార్ధం రోజునే ఆత్మహత్య తో కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిద్రండ్రులు
-ఆత్మహత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఖమ్మం పోలీసులు
-లాడ్జి ను సందర్శించిన పోలీస్ ఉన్నతాధికారులు

ఖమ్మం పట్టణంలోని గాంధీ చౌక్ లోగల ఒక ప్రవేట్ లాడ్జి లో ఎఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఆత్మహత్య కలకలం రేపింది. మరోకొద్దీ రోజుల్లో పెళ్లి కావలసిన అశోక్ , నిశ్చతార్ధం జరగాల్సిన రోజునే సూసైడ్ చేసుకోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై విచారణ జరుపుతున్నామని స్థానిక పోలీస్ అధికారులు తెలిపారు. అశోక్ స్వగ్రామం కల్లూరు మండలం యజ్ఞనారాయణ పురం . ఇటీవలనే ఆయన కొత్తగూడెం స్పెషల్ పార్టీ నుంచి ములుగు బదిలీపై వెళ్లారు .

ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో సూసైడ్ చేసుకుని చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్..2020లో పోలీస్ ఏ.ఆర్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు.. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో పని చేశాడు..పోలీస్ శాఖలో బదిలీలో ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లా కు బదిలీ..ఈ నెల 8వ తారీఖు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు..రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించిన లాడ్జి యాజమాన్యం..పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడగా ఉరి వేసుకుని చనిపోయిన గుర్తించారు

సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం..
ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థ కార్యక్రమం ఉంది..పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. పోస్ట్ మార్టం అనంతరం బాడీ ని అశోక్ స్వగ్రామం తరలించారు .

Related posts

అమ్మాయిల పిచ్చితో 80 లక్షలు పోగొట్టుకున్న డాక్టర్…

Drukpadam

రేప్ చేస్తామంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతికి బెదిరింపులు!

Drukpadam

బాలికపై అత్యాచారం.. సాయం కోసం అర్ధించినా స్పందించని జనం.!

Ram Narayana

Leave a Comment