Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

రాజ‌మౌళి సొంత రాష్ట్రంలో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల ధ‌ర‌లు పెంచ‌క‌పోవ‌డం ఏంటీ?: ఆర్జీవీ!

రాజ‌మౌళి సొంత రాష్ట్రంలో ‘ఆర్ఆర్ఆర్’ టికెట్ల ధ‌ర‌లు పెంచ‌క‌పోవ‌డం ఏంటీ?: ఆర్జీవీ!
-రూ.2,200కి విక్ర‌యించ‌డానికి మహారాష్ట్రలో అనుమతి
-ఉత్త‌రాది రాష్ట్రాల‌న్నిట్లోనూ అనుమ‌తి
-ఏపీలో మాత్రం రూ.200కు మించ‌లేదు

ఏపీలో సినిమా టికెట్స్ ధరల విషయంలో ఇంకా ఒకస్పష్టత రాలేదు . ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఏపీ ప్రభుత్వం , లేదు నిర్మాతలకు ,హీరోలకు ఇబ్బందులు ఏర్పడతాయని సినీ పరిశ్రమ ఎవరికీ వారు తమవాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై సినీపరిశ్రమకు చెందిన అనేకమంది స్పందించారు. ఏపీ ప్రభుత్వ విధానంపై పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి , నాని సిద్దార్థ్ వరకు అందరు విమర్శలు గుప్పించారు. నిర్మాతల మండలి ఏపీ ప్రభుత్వ మంత్రి పేర్నినానిని కలసి టికెట్స్ రేట్ల పెంపుదలపై విన్నవించింది.అందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఇప్పుడు కమిటీ వద్ద ఏమైనా అభ్యంతరాలు ఉంటె చెప్పుకోవచ్చు అని చెప్పింది. చివరకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు.ఆయన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలసి చర్చలు జరిపారు. అయిన సమస్య కొలిక్కి రాలేదు . దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న ఏపీ మంత్రి పేర్ని నానితో చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ స‌మస్య‌కు పరిష్కారం దొర‌క‌క‌పోవ‌డంతో ఆర్జీవీ ఈ వివాదంపై మ‌రోసారి ట్వీట్ చేశారు.

‘ద‌ర్శ‌కుడు రాజమౌళి రూపొందించిన‌ ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధర రూ.2,200కి విక్ర‌యించ‌డానికి మహారాష్ట్రలో అనుమతి ఇచ్చారు. కానీ, రాజ‌మౌళి సొంత రాష్ట్రం ఏపీలో మాత్రం టికెట్లను రూ.200కి విక్రయించడానికి కూడా అనుమతి లేదు. ఇది కట్టప్పను ఎవరు చంపారు? అనే ప్ర‌శ్న‌లా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఐమాక్స్ మల్టీప్లెక్స్ ల‌లో టికెట్లను రూ.2,200కి విక్రయిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

కాగా, ఏపీలో టికెట్ల ధ‌ర‌ల‌పై ఇటీవ‌ల ఆర్జీవీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఏపీ మంత్రి పేర్ని నాని కూడా స‌మాధానం ఇచ్చి, టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై నేరుగా చ‌ర్చించిన‌ప్ప‌టికీ వివాదం ముగియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Related posts

అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు… హోరెత్తనున్న ప్రచారం !

Drukpadam

మోహన్ బాబుకు చిరంజీవి ఫోన్….

Drukpadam

అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు.. తరలివచ్చిన తారాలోకం

Ram Narayana

Leave a Comment