Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ …పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తాం;ఎంపీ అరవింద్!

డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ …పార్టీలోకి వస్తే టికెట్ ఇస్తాం;ఎంపీ అరవింద్!
కేసీఆర్ ముఖాన రాజీనామా కొట్టి రండి.. బీజేపీలో చేరండి: డీజీపీకి అరవింద్ హితవు
నాపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారు
మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉందని కోర్టు కూడా తప్పుపట్టింది
అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దు

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బీజేపీకి చెందిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బంపర్ అఫర్ ప్రకటించారు . తనపై సీఎం కేసీఆర్ చెపితే తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు . దీనిపై కోర్ట్ కూడా స్పందించింది.తప్పుడు కేసులు పెట్టమని కేసీఆర్ అంటే క్రెడిబులిటీ ఉన్న మీరు రాజీనామా కేసీఆర్ మొఖాన కొట్టి వస్తే బీజేపీ ముమ్ములను అక్కున చేర్చుకొని ఎన్నికల్లో టికెట్ కూడా ఇస్తుందని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై డీజీపీ అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెట్టమంటే అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని విమర్శించారు. మీ ఎఫ్ఐఆర్ అతిగా ఉందంటూ కోర్టు కూడా తప్పుపట్టిందని… అనవసరంగా క్రెడిబిలిటీ కోల్పోవద్దని అన్నారు.

మీకు చిత్తశుద్ధి ఉన్నట్టైతే… కేసులు పెట్టాలని కేసీఆర్ చెపితే రాజీనామా ఆయన మొహాన కొట్టి బీజేపీలోకి రావాలని డీజీపీని ఉద్దేశించి అరవింద్ అన్నారు. బీజేపీ మిమ్మల్ని రాజకీయ నాయకుడిని చేస్తుందని… టికెట్ కూడా ఇస్తుందని అన్నారు. ఏడాదిన్నరలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం పతనమవుతుందని చెప్పారు. ఒక మహిళా టీచర్ చనిపోతే చూడటానికి కూడా రాని కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి అవసరమా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి కవితది కాదని అన్నారు.

Related posts

పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ…రాష్ట్రాల పరిధిలోని అంశం తేల్చిన కేంద్రం …

Drukpadam

స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ మద్దతు కోరిన తెరాస…పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతామన్న సిపిఐ…

Drukpadam

మల్లాది వాసు సారీ !…..వల్లభనేని వంశీ పశ్చాతాపం!!…

Drukpadam

Leave a Comment