Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

లొంగిపోయిన మావోయిస్టులకు నగదును అందజేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్!

లొంగిపోయిన మావోయిస్టులకు నగదును అందజేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్!
-ఒక్కరికి లక్ష చొప్పున తక్షణ పునరావాసం
-లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు
-లొంగి పోయినవారికి ఇలాంటి కేసులు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తాం
-ప్రశాంత జీవితం గడిపేందుకు అవకాశం కల్పిస్తాం

మావోయిస్టులు జనజీవన స్రవంతి కలిసేందుకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు . వారికీ ప్రకటించిన రివార్డ్ లతో పాటు వారు తమ జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు సహకరిస్తామని తెలిపారు .మంగళవారం తన కార్యాలయంలో ఇటీవల లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన 05గురు మావోయిస్టులకు పునరావాసం మరియు తక్షణ సహాయం క్రింద నగదును చెక్కుల రూపంలో అందజేయడం జరిగింది.మావోయిస్ట్ పార్టీ దళ సభ్యులు 01)మడవి అడమి@విజ్జి@సింధు,దళ సభ్యరాలు,R/o.రాళ్లపురం గ్రామం,చర్ల మండలం.
02)పోడియం.సంతోష్@విక్రమ్@బీదయ్య,దళ సభ్యుడు,R/oకిష్టారంపాడు గ్రామం,చర్ల మండలం.
03)మడకం.బుద్రి@సోనీ, మణుగూరు LOS సభ్యుడు,R/o.పుట్టపాడు,సుకుమా జిల్లా,CG.
04)మడవి.ఇడుమ@సురేందర్,ఏరియా కమిటీ సభ్యుడు మరియు BK-EG డివిజన్ సెక్రటరీ ఆజాద్ కు గార్డ్ కమాండర్,R/o.బూరుగుపాడు గ్రామం,చర్ల మండలం
05)ముసికి.బుద్రి@BR@నరేష్,దళ సభ్యుడు,బీజాపూర్ జిల్లా,CG.ఈ ఐదుగురు సభ్యులకు ఒక్కొక్కరికి 1,00,000/-ల రూపాయల నగదును చెక్కుల రూపంలో ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ అందజేశారు.మావోయిస్టు పార్టీ నాయకులు మరియు దళ సభ్యులు మరియు మిలీషియా సభ్యులు పోలీసు వారి ఎదుట లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనాన్ని గడపాలని కోరారు. లొంగిపోయిన వారిపై ఎలాంటి కేసులు లేకుండా చేసి,ప్రభుత్వం తరపు నుండి మరియు పోలీసుశాఖ తరపు నుండి అన్ని రకాల సహాయసహకారాలను అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేశారు.

Related posts

న్యూజెర్సీలో దారుణం..భారత సంతతి వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగుడు!

Drukpadam

డాక్టర్ ప్రీతి కేసులో మరో మలుపు.. ర్యాగింగ్‌ను అంగీకరించిన సైఫ్!

Drukpadam

ఈ రోడ్ నాదే నేను కొన్నాను అని… అమరావతి రైతు రోడ్ ను తవ్వి కంకర తీసుకెళ్లిన వైనం

Drukpadam

Leave a Comment