రఘురామకృష్ణరాజుకు నాలుగు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు!
హైదరాబాద్, గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి సీఐడీ
ఇంట్లో నోటీసులు ఇచ్చిన అధికారులు
ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశం
హైదరాబాదులోని ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు
రేపు రఘురామ విచారణకు రావాలని నోటీసులు
నోటీసులు తనకు ఇచ్చి వెళ్లాలన్న రఘురామ కుమారుడు
అందుకు తొలుత అంగీకరించని ఏపీ సీఐడీ పోలీసులు
హైదరాబాద్, గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు సదరు ఎంపీకి నేరుగా నోటీసులు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. చివరకు ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన కుమారుడికి నాలుగు నోటీసులు ఇచ్చారు.
ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు . రేపు రఘురామ విచారణకు రావాలని అందుకే వచ్చామని వారు తెలిపారు . ఇంట్లో కుమారుడు ఇతర సిబ్బంది ఉన్నారు. సి ఐ డి పోలీసులు రఘరామ కోసం వచ్చామని ఆయనకే నేరుగా నోటుసులు ఇస్తామని చెప్పారు .ఆయన ఇంట్లో లేనందున తనకు ఇస్తే ఫాధర్ కు అందజేస్తానని కుమారుడు తెలిపారు .ముందు ఆయన వచ్చే దాక ఉంది నోటీసులు ఇస్తామన్న అధికారులు చివరికి కుమారుడికి ఇచ్చి వెళ్లారు .
అయితే, ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆ నోటీసులు తనకు ఇచ్చి వెళ్లాలని రఘురామకృష్ణరాజు కుమారుడు సీఐడీ అధికారులను కోరారు. అందుకు ఏపీ సీఐడీ పోలీసులు ముందు ఒప్పుకోలేదు. ఆ నోటీసులను రఘురామకృష్ణరాజుకే ఇస్తామని చెప్పారు. ఎంతసేపటికి ఆయన రాకపోవడంతో వారు ఆయన కుమారుడికి నోటీసులు ఇచ్చారు.
ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచారణకు రావాలని రఘురామకృష్ణరాజును ఆదేశించారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ఈ నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన ఇంటి నుంచి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లిపోయారు.
మరోపక్క, రేపు నరసాపురానికి వస్తానని రఘురామకృష్ణరాజు ఇప్పటికే ప్రకటించారు. రెండు రోజుల పాటు నరసాపురంలో పర్యటిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇస్తుండడం గమనార్హం. ఏపీ సీఎం జగన్‌పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపైనే విచారణ జరుగుతోంది.