Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇండియా పాస్ పోర్ట్ తో వీసా అవసరం లేకుండా 60 దేశాలకు వెళ్ళవచ్చు !

వీసా లేకుండా 60 దేశాలకు.. శక్తిమంతమైన పాస్ పోర్ట్ జాబితాలో భారత్ ర్యాంక్ ఇదే!

  • ఏడు స్థానాలు ఎగబాకిన పాస్ పోర్ట్
  • 90 నుంచి 83వ ర్యాంక్ కు
  • ఎప్పటిలాగే జపాన్ పాస్ పోర్టుకు మొదటి ర్యాంకు
  • అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్ గా ఆఫ్ఘన్ పాస్ పోర్ట్

భారత పాస్ పోర్ట్ శక్తిమంతంగా మారుతోంది. వీసా లేకుండా మరిన్ని దేశాలకు ప్రయాణం చేసేలా మన పాస్ పోర్ట్ ర్యాంక్ మెరుగవుతోంది. అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్టుల జాబితాలో 7 స్థానాలను మెరుగుపరచుకుంది. గత ఏడాది 90వ స్థానంలో ఉన్న భారత పాస్ పోర్ట్.. ఇప్పుడు 83వ ర్యాంక్ కు ఎగబాకింది.

మన పాస్ పోర్ట్ తో వీసా అవసరం లేకుండా 60 దేశాలకు ఎంచక్కా ఎగిరిపోవచ్చు. అంతకుముందు సంవత్సరం 58 దేశాలకే ఈ అవకాశం ఉండేది. ఇప్పుడు మరో రెండు దేశాలు ఒమన్, అర్మేనియాలు మనకు వీసా మినహాయింపునిచ్చాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) గణాంకాల ప్రకారం ‘హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్’ ప్రతి సంవత్సరం పాస్ పోర్టుల ర్యాంకులను వెల్లడిస్తుంది. ఈ సారి 199 దేశాల పాస్ పోర్టులతో జాబితాను వెల్లడించింది.


ఎప్పటిలాగే ఈ జాబితాలో జపాన్ పాస్ పోర్ట్ ముందుంది. దాంతో పాటే సింగపూర్ కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఆ రెండు దేశాల పాస్ పోర్టులతో వీసా అవసరం లేకుండా 192 దేశాలను చుట్టేసి రావొచ్చు. జర్మనీ, దక్షిణ కొరియా పాస్ పోర్టులు రెండో ర్యాంకును సాధించాయి. ఫిన్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్ పాస్ పోర్టులు మూడో స్థానంలో నిలిచాయి. నాలుగో స్థానంలో ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఐదో స్థానంలో ఐర్లాండ్, పోర్చుగల్ ఉన్నాయి.

అమెరికా పాస్ పోర్టుతో 180 దేశాలకు వెళ్లిరావొచ్చు. అమెరికా, బ్రిటన్ లు సంయుక్తంగా ఆరో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీక్, మాల్టాలు ఏడో స్థానంలో ఉన్నాయి. పోలండ్, హంగరీలకు 8వ ర్యాంక్, లిథువేనియా, స్లొవేకియాలకు 9వ ర్యాంకు దక్కాయి. ఎస్టోనియా, లాట్వియా, స్లొవేనియాలు పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. మొత్తంగా ఈసారి టాప్ టెన్ లో యూరప్ పాస్ పోర్టుల హవా కొనసాగింది.

ఇక అత్యంత బలహీనమైన పాస్ పోర్టుగా ఆఫ్ఘనిస్థాన్ పాస్ పోర్టు నిలిచింది. చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశంలో తాలిబన్ల రాజ్యం రావడం, అరాచకాలు మరింత పెరిగిపోవడం, అన్ని దేశాలు ఆఫ్ఘన్ కు సాయాన్ని నిరాకరించడం వంటి కారణాలతో ఆ దేశ పాస్ పోర్ట్ మరింత వీకైందని చెప్పొచ్చు.

Related posts

నాటు కోడి గుడ్ల విషయంలో భారత్​ తో అమెరికా గొడవ…..

Drukpadam

ఓపెనింగ్ కు సిద్ధమవుతున్న తెలంగాణ సెక్రటేరియట్.. !

Drukpadam

లేటు వయసులో పదో తరగతి పాసైన హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా!

Drukpadam

Leave a Comment