Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పార్టీ పేరుపై అభ్యంతరం …అన్న చెల్లెలు మధ్య యుద్ధం తప్పదా…?

షర్మిల పార్టీ పేరుపై అభ్యంతరం …అన్న చెల్లెలు మధ్య యుద్ధం తప్పదా…?
మరోపేరు తో రావాలని కోరిన ఎన్నికల సంఘం
షర్మిల పార్టీ పేరు మార్చాల్సిందే – ఎన్నికల సంఘం
ఇప్పటివరకు వైయస్ఆర్ టీపీ పేరుతొ కార్యక్రమాలు
పేరు మార్పుకు షర్మిల అంగీకరిస్తారా ? లేదా? సందేహం …

షర్మిల దివంగత ఉమ్మడి ఏపీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి …తెలంగాణ లో రాజన్న రాజ్యం తనతోనే సాధ్యమనే నినాదంతో పార్టీ పెట్టారు . దానిపేరు వైయస్సార్ టీపీ గా నామకరణ చేశారు . అయితే ఇది అచ్చం జగన్ పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ ను పోలిఉండటంతో ఒకే రకంగా ఉన్నందున అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు చేసింది. దీంతో వేరే పేరుతొ రావాలని ఎన్నికల సంఘం సూచించింది .దీంతో ఇద్దరి మధ్య యుద్ధం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించిన వైఎస్ షర్మిలకు ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. గత ఏడాది తన తండ్రి జన్మదినం నాడు షర్మిల అట్టహాసం గా తన పార్టీ పేరు వైఎస్సార్టీపీగా ప్రకటించారు. ఇప్పుడు అదే పేరుతో పార్ట కొనసాగింపుకు ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో..పార్టీ రిజిస్ట్రేషన్ సైతం నిలిచిపోయింది. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం మేరకు షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో ఏపీలో ఇప్పటికే జగన్ నాయకత్వంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు తమ పార్టీ పేరును పోలి ఉందంటూ, ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ,సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం ఈకేసు విచారణలో ఉంది. కాగా, తెలంగాణలో షర్మిల నాయకత్వంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ కూడా తమ పార్టీ పేరును పోలి ఉందంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతూ భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం షర్మిల పార్టీ రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసినట్లు వెల్లడించింది .వైయస్ షర్మిల కు మరికొన్ని ఇతర పేర్లు సూచించాలని ఈ నెల 3 వ తేదీన లేఖ రాసింది. ఇప్పటికే వైఎస్సార్టీపీ పేరుతో షర్మిల తెలంగాణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ అధినేత్రిగా పాదయాత్ర సైతం నిర్వహిస్తున్నారు. దీక్షలు..నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఎన్నికల సంఘం పంపిన లేఖలో మరో పేరు ప్రతిపాదించాలని సూచించింది.

నాడు వైఎస్సార్సీపీ విషయంలోనూ దీని పైన న్యాయపోరాటం చేయటం లేదా… అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారితో రాజీ పడి.. గతంలో వైఎస్సార్సీపీ ప్రారంభంలో అమలు చేసిన ఫార్ములా అమలు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి.. షర్మిల తన తండ్రి పేరుతోనే పార్టీ పేరు కొనసాగించేందుకే మొగ్గు చూపటం ఖాయం. దీంతో..మరి ఇప్పుడు ఈ పార్టీ పేరు పైన మొదలైన అభ్యంతరాలు..ఎన్నికల సంఘం లేఖ పైన ఏ రకంగా స్పందిస్తారు.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.

Related posts

వామ్మో పెట్రోల్ @100 క్రాస్ అవుతుందా …

Drukpadam

చంద్ర‌బాబు త్యాగం అంటే ప‌వ‌న్‌ను సీఎం చేస్తారా?: స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి!

Drukpadam

ఎమ్మెల్యే వెంకటవీరయ్య నివాసాన్ని ఖాళీ చేయించేందుకు విశ్వప్రయత్నాలు!

Drukpadam

Leave a Comment