Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం…మంత్రి పువ్వాడ హెచ్చరిక!

ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం
ప్రైవేటు ట్రావెల్స్‌కు మంత్రి పువ్వాడ హెచ్చరిక

ప్రజలకు ప్రయాణం భారం కాకుండా సులభంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అజయ్ హెచ్చరించారు.

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు, ఇతర వాహనాలు నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరిగిన, పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగిస్తే ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి అజయ్ కుమార్ ఆదేశించారు. ప్రధానంగా పర్మిట్‌ కండిషన్‌, కమర్షియల్‌ లగేజీ తీసుకెళ్లడం, అనుమతికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడం, అధిక చార్జీలు వసూలు చేయడంపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లతో పాటు జిల్లాల్లోని జాతీయ రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు పోలీసుల సహకారంతో డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లు నిర్వహించాలన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‎పేట రింగ్ రోడ్డు వద్ద శంషాబాద్ – బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు సోదాలు చేశారని నిబంధనలు పాటించని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 4 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Related posts

హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒక్క రూపాయే చార్జి.. ఎందుకు? ఎప్పుడో తెలుసా?

Ram Narayana

రాహుల్ ని అనే ముందు మీకు ఎంత తెలుసో చెప్పండి: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Drukpadam

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం :కె .రాంనారాయణ!

Drukpadam

Leave a Comment