Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

మూడో టెస్టులో టీమిండియా నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన గవాస్కర్!

మూడో టెస్టులో టీమిండియా నిర్ణయాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన గవాస్కర్!

  • మూడో టెస్టులో భారత్ ఓటమి
  • లంచ్ తర్వాత భారత్ ఎత్తుగడలపై గవాస్కర్ ఆశ్చర్యం
  • ఈ నెల 19 నుంచి వన్డే సిరీస్

దక్షిణాఫ్రికాలో తొలిసారిగా టెస్టు సిరీస్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకోవడం పట్ల క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. నాలుగో రోజు ఆటలో లంచ్ తర్వాత సెషన్ లో టీమిండియా అనుసరించిన ఎత్తుగడలను ఆయన తప్పుబట్టారు. లంచ్ తర్వాత మరో 41 పరుగులు చేస్తే సఫారీలు గెలుస్తారనగా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ లతో బౌలింగ్ చేయించకపోవడం ఏంటని గవాస్కర్ ప్రశ్నించారు.

ఓటమికి సిద్ధమయ్యే లంచ్ తర్వాత మైదానంలో అడుగుపెట్టారా? అందుకే ఉమేశ్ యాదవ్, అశ్విన్ లతో బౌలింగ్ చేయించారా? అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మ్యాచ్ లో తాము గెలవడంలేదని టీమిండియా ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. లంచ్ తర్వాత శార్దూల్ ఠాకూర్, బుమ్రాలతో ఎందుకు బౌలింగ్ చేయించలేదో తనకు మిస్టరీగా ఉందని అభిప్రాయపడ్డారు.

అంతేకాదు, అశ్విన్ బౌలింగ్ చేస్తుంటే మరీ రక్షణాత్మక ధోరణిలో ఫీల్డింగ్ మోహరింపులు ఏర్పాటు చేయడాన్ని కూడా గవాస్కర్ ఎత్తిచూపారు. అశ్విన్ బౌలింగ్ లో ఫీల్డింగ్ ప్లేస్ మెంట్లు సరిగా లేవని అభిప్రాయపడ్డారు. “సింగిల్స్ ఎంతో సులువుగా లభిస్తున్నాయి. ఐదుగురు ఫీల్డర్లు దూరంగా ఉన్నారు. దాంతో బ్యాట్స్ మెన్ కు స్వేచ్ఛగా ఆడే వెసులుబాటు లభించింది అని విశ్లేషించారు.

ఈ క్రమంలో గవాస్కర్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్లను కూడా ప్రశంసించారు. మరోసారి రెండో ఇన్నింగ్స్ లో 200కి పైగా స్కోరును ఛేదించారని కొనియాడారు. పిచ్ లు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా జోహాన్నెస్ బర్గ్ లోనూ, కేప్ టౌన్ లోనూ ఓ జట్టుగా తమ దృఢచిత్తాన్ని చాటుకున్నారని అభినందించారు.

మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు సెంచురియన్ లో జరగ్గా టీమిండియా 113 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ తర్వాత జోహాన్నెస్ బర్గ్ వేదికగా రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. కేప్ టౌన్ వేదికగా చివరి టెస్టులోనూ సఫారీలనే విజయం వరించింది. దాంతో 2-1తో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 19న ప్రారంభం కానుంది.

Related posts

కాన్వే, రచిన్ రవీంద్ర సెంచరీల మోత… వరల్డ్ కప్ లో ఘనంగా బోణీ చేసిన న్యూజిలాండ్

Ram Narayana

మాల్దీవుల్లో ఓ బార్లో డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ డిష్యుం డిష్యుం! గాలి వార్తే

Drukpadam

ఐపీఎల్-2022 షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ…

Drukpadam

Leave a Comment